గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2023 (10:44 IST)

చీరాల మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా?

Chirala MLA
Chirala MLA
చీరాల మాజీ ఎమ్మెల్యే  ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు (స్వాములు) జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది. 
 
ఆమంచి కృష్ణ మోహన్ ఇటీవల పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఓ ఫ్లెక్సీ చర్చకు దారితీసింది.
 
జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో అభిమానులు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫె
 
ఆ ఫ్లెక్సీపై జనసేనాని పవన్ కల్యాణ్, స్వాములు ఫొటోను ముద్రించారు. ఈ ఫ్లెక్సీతో ఆమంచి సోదరుడు త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ చర్చ మొదలైంది.