గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2023 (16:15 IST)

రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించిన మహిళ.. ఏమైందంటే..?

railway track
రైలు ప్రమాదంలో జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుంది. చిన్న పొరపాటు జరిగినా తమ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా పట్టాలు దాటుతున్నారు. తాజాగా ఓ మహిళ సైతం పట్టాలు దాటబోయి రైలు కింద పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆమె స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని గయా ప్రాంతంలో తన్‌కుప్ప రైల్వే స్టేషన్ నుంచి ఒక గూడ్సు రైలు బయలుదేరింది. సరిగ్గా అదే సమయంలో ఒక మహిళ రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది. తనవైపుకి రైలు దూసుకెళ్తున్నా.. ఎట్టిపరిస్థితుల్లోనైనా పట్టాలు దాటాలని ఒకడుగు ముందుకేసింది. కంగారులో కాలుజారి పట్టాలపై పడింది. 
 
ఇంతలో ట్రైన్ దూసుకురావడంతో పట్టాల మధ్య పడుకుంది. రైలు వెళ్లిపోయేంతవరకు కదలకుండా.. అలాగే ఉండిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలైనాయి. 
 
పట్టాల కింద ఆమెను గమనించిన పోలీసులు.. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని రైలు వెళ్లాక ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి నెట్టింట్‌లో పెట్టగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది.