శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (10:30 IST)

వైఎస్ఆర్ పేరును ప్రస్తావించని ఎంపీ విజయసాయి రెడ్డి... పీఎం కిసాన్‌పై ప్రశంసలు

vijayasaireddy
వైకాపా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మనస్సు మారిందా? కరుడుగట్టిన వైకాపా నేతగా ఉండే ఆయన.. తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన వైఎస్ఆర్ పేరును ప్రస్తావించకుండానే పీఎం కిసాన్ పథకంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది వైకాపా శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ కింద రూ.16800 కోట్లు విడుదల చేయడాన్ని విజయసాయి ట్విటర్‌లో కొనియాడారు. పీఎం కిసాన్‌పై ఆయన చేసిన ట్వీట్ ఇపుడు అమితాసక్తిగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7500 కలిపి మొత్తం రూ.13500ను అర్హులైన లబ్దిదారులకు అందిస్తున్నారు. 
 
ఈ పథకాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్‌గా పేర్కొంటూ ప్రచారం కల్పిస్తున్నారు. మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని ఈ నిధులను విడుదల చేశారు. అయితే, విజయసాయి రెడ్డి కేవలం పీఎం కిసాన్‌పై ట్వీట్ చేయడం విశేషం. ఈ పథకం కింద 8 కోట్లపకు పైగా రైతులకు యేడాదికి రూ.6 వేలు చొప్పున అందుకున్నారని తెలిపారు. వ్యవసాయ రంగానికి ఇది గొప్ప సహాయకారిగా నిలుస్తుందన్నారు. ప్రధాని మానస పుత్రిక అయిన ఈ పథకాన్ని తాను అభినందిస్తున్నట్టు వెల్లడించారు.