శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మే 2022 (22:31 IST)

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లో చేస్తే.. కుళ్లిన మాంసం వచ్చింది.. పెళ్లి ఆగిపోయింది..

chicken
ఆన్‌లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్‌లో టన్నులలో కుళ్లిపోయిన మాంసం రావడం తమిళనాట పెను సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. పెళ్లి వారు విందు భోజనం కోసమని సేలం ఆర్ఆర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు కాంట్రాక్ట్ ఇచ్చారు. వారు జొమాటో ద్వారా ఒక టన్ మటన్, 200 కిలోల చికెన్ ఆర్డర్ తీసుకున్నారు.  
 
ఆన్‌లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్‌లో టన్నులలో కుళ్లిపోయిన మాంసం రావడంపై పెళ్లి బృందం ఫుడ్ సేఫ్టీ అధికారులకు పిర్యాదు చేశారు. దీంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు కుళ్లిన మాంసంగా నిర్ధారించారు. దీనిపై సేలం ఆర్ ఆర్ బిర్యానీ, జొమాటో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. 
 
అటు, బిర్యానీ లేకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకున్నట్లు ఇరువురి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన తమిళనాడులోని ఓరథనాడులో జరిగింది. అన్‌లైన్ ఫుడ్ సరఫరా చేసే జోమాటో నిర్వాకానికి ఆ కొత్త జంట ఒక్కటి కాలేకపోయారు.