గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (14:33 IST)

జూన్ దాటితే డిసెంబర్ వరకు ముహూర్తాలు కరువే

Wedding
కరోనా ఉధృతి తగ్గడం, ముహూర్తాలు విరివిగా ఉండడంతో ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పెళ్లి బాజాలు మార్మోగాయి. రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం జూన్ దాటితే డిసెంబర్ వరకు ముహూర్తాలు కరువేనని పురోహితులు చెప్తుండటంతో తల్లిదండ్రులు హడావుడిగా పెళ్లిళ్లు జరిపేస్తున్నారు. 
 
ఈ నెల మే తర్వాత జూన్‌ మినహా డిసెంబరు వరకు ముహూర్తాలు లేవు. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న వారు ఆరు నెలలపాటు ఎదురు చూడటం మంచిది కాదన్న ఆలోచనలు తల్లిదండ్రుల్లో ఒత్తిడిని పెంచుతున్నాయి. గత ఐదేళ్లలో ఏ సంవత్సరం జరగనన్ని వివాహాలు ఈ సంవత్సరంలో జరుగుతున్నాయి. 
 
ముహూర్తాలు కూడా ఈ ఐదు నెలలపాటు వరుసగా ఉండడంతో వివాహాలకు సంబంధించిన వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఇక మే 18 నుంచి డిసెంబరు చివరి ముహూర్తంలోపుగా జిల్లా వ్యాప్తంగా మరో మూడు వేల చిన్న, పెద్ద వివాహాలు జరగనున్నట్లు తెలుస్తోంది.