Daily Horoscope
✕

బ్రెడ్‌తో ఆనియన్ పకోడీలు ట్రై చేయండి..

శీతాకాలంలో వేడి వేడిగా స్నాక్స్ తీసుకోవాలని అనుకుంటుంటాం. అయితే తీసుకునే స్నాక్స్‌ విషయంలోనూ పోషకాలుండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్. ఆనియన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అ

Written By Selvi
Updated: మంగళవారం, 13 డిశెంబరు 2016 (13:24 IST)
శీతాకాలంలో వేడి వేడిగా స్నాక్స్ తీసుకోవాలని అనుకుంటుంటాం. అయితే తీసుకునే స్నాక్స్‌ విషయంలోనూ పోషకాలుండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్. ఆనియన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇంకా వచ్చిన రోగాలు సైతం మాయమైపోతాయి. అందుకే ఉల్లిపాయలతో బ్రెడ్ పకోడీలు ట్రై చేయండి. 
 
కావలసిన పదార్థాలు :
శనగపిండి -  రెండు కప్పులు. 
జొన్నపిండి - ఒక కప్పు
ఉల్లి తరుగు - ఒకటిన్నర కప్పు
బఠాణీ పిండి - అర కప్పు
కొత్తిమీర -  అరకప్పు
ఉప్పు - సరిపడినంత. 
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత. 
మజ్జిగ - ఒక కప్పు. 
బ్రెడ్ - 12 ముక్కలు
ఉల్లి (తురుము) - అరకప్పు
మిర్చి, అల్లం పేస్టు - మూడు టీ స్పూన్లు. 
 
తయారీ విధానం :
ముందుగా వెడల్పాటి గిన్నెలో శనగపిండి, జొన్నపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, బఠాణీ పిండి, ఉల్లితరుగు, ఉప్పుల మిశ్రమాన్ని సరిపడినన్ని నీళ్ళతో కలిపి జారుగా చేసుకోవాలి. బ్రెడ్ స్లైసుల చివర్లు కట్‌చేసి వాటిని మజ్జిగలో ముంచి రెండు నిమిషాల తర్వాత నీటిని పిండేయాలి. బ్రెడ్ ముద్దను శనగపిండి మిశ్రమంలో అద్ది ఆపై ఆయిల్‌లో దోరగా వేయించాలి. వేడిగా వున్నప్పుడే చిల్లీసాస్ లేదా టమాట సాస్‌లతో కలిపి పిల్లలకు సర్వ్ చేస్తే.. టేస్ట్ అదిరిపోతుంది. 

అన్నీ చూడండి

రీపోలింగ్ నిర్వహిస్తేనే ఓటు వేస్తా : పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్

'మురసు' తుఫాను : నెల్లూరు - నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం

గొడ్డలి పార్టీ నేతలు రెచ్చగొట్టినా ప్రశాంతంగా ఉండాలి : కూటమి శ్రేణులకు సీఎం బాబు పిలుపు

పులివెందుల ఆర్వో ఆఫీస్ వద్ద జగన్ నిరసన - రీపోలింగ్‌కు డిమాండ్ (Video)

పులివెందుల వీధుల్లో జగన్ కాన్వాయ్‌కు ఎదురెళ్లిన దమ్మున్నోడు దస్తగిరి (వీడియో)

అన్నీ చూడండి

రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్‌సీ-17

విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ ట్రైలర్ రాబోతోంది

నువ్వు విలన్ వి ? చనిపోతావా? ఓడిపోతావా? అని నిలదీశిన యశ్ కుమారుడు

Rudravanam PS Series Review: రుద్రవనం పీఎస్ లో మర్డర్ల రహస్యం ఏమిటి? వెబ్ సిరీస్ రివ్యూ

Prakash Raj, ఇచ్చిన సినీ అడ్వాన్సులు వెనక్కి తీస్కుంటున్నారు: ప్రకాష్ రాజ్ భార్య పోనీ

తర్వాతి కథనం
Show comments