Webdunia - Bharat's app for daily news and videos

Install App

మష్రూమ్ బిర్యానీ...

Updated: గురువారం, 29 నవంబరు 2018 (11:46 IST)
పుట్టగొడుగులు కనీసం వారానికి రెండు నుండి నాలుగు సార్లు తీసుకుంటే హైబీపీ అదుపులో ఉంటుంది. శరీరానికి కావలసిన విటమిన్ డి పుట్టగొడుగులో అధిక మోతాదులో ఉంది. దీనిలోని పోషక విలువలు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇలాంటి పుట్టగొడుగుతో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
పుట్టగొడుగులు - 200 గ్రా
బియ్యం - 2 కప్పులు
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
పచ్చిమిర్చి - 1
నూనె - తగినంత
గరం మసాలా - 1 స్పూన్
ఉల్లిపాయ - 1
టమోటా - 1
ఉడికించిన గుడ్డు - 1
క్యాప్సికమ్ - 2
కొత్తిమీర - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా పుట్టగొడుగులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడయ్యాక పుట్టగొడుగులు వేసి నీరంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. మరో బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు వేయించి గరంమసాలా వేసి ముందుగా వేయించికున్న పుట్టగొడుగులు చేర్చి మరికొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని తగినన్ని నీరు చేర్చి ఉడికించుకోవాలి. అన్నం సగం ఉడికిన తరువాత క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ, టమోటా, గుడ్డు వేసి కాసేపు ఉడికించి తీసుకుంటే వేడి వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ. 

అన్నీ చూడండి

భావన ఆరోపణలన్నీ అవాస్తవం, ఆమె విధుల్లో కొనసాగుతున్నారు: టెక్ మహీంద్రా

ప్రాణం తీసిన కుమారుడు ఐఫోన్ మోజు - విషాదానికి ముందు తల్లి సంగీత వీడియో

డీవైఎఫ్ఐ అధ్యక్షురాలిగా తొలిసారి మహిళ ఎంపిక

నీ కోసం నా మంగళ సూత్రాన్ని తీసేస్తాను బిడ్డా... నన్ను వదిలి వెళ్లకు (వీడియో)

లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్... బెంగుళూరు రెస్టారెంట్‌ బిల్లులో బాడీ షేమింగ్

అన్నీ చూడండి

యశ్ 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి - మల్లారెడ్డి వర్శిటీపై కేసు

దుష్ప్రచారం చేస్తే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా : గోవిందా హెచ్చరికలు

బాలీవుడ్ హీరోహీరోయిన్ల మధ్య వయసు అంతరం : మనీషా కోయిరాలా

మూడోసారి గర్భమా? అది ప్రెగ్నెన్సీ కాదు.. పిజ్జా తినడం వల్లే...

ఇకపై కేవలం బ్లాక్‌బస్టర్ చిత్రాలే తీస్తా : నిర్మాత బండ్ల గణేశ్

తర్వాతి కథనం
Show comments