1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

పెరుగు పచ్చడి

అల్లం
అవసరమైన వస్తువులు :

పుల్లటి పెరుగు : 1 కప్‌
అల్లం : 1 ముక్క
పచ్చిమిరపకాయలు : 2 కాయలు
కీరదోసకాయ : 2 కాయలు
కొత్తిమీర : 2 రెమ్మలు
కరివేపాకు : 2 రెమ్మలు
నూనె : 1 స్పూన్‌
ఆవాలు : 1 స్పూన్‌
మినపప్పు : 1 స్పూన్‌
ఉప్పు : తగినంత

ఇలా చెయ్యాలి :

అల్లం, పచ్చి మిరపకాయలను నూరిపెట్టుకోండి. కీరదోసకాయను తురిమిపెట్టుకోండి. కొత్తిమీర, కరివేపాకులను పెరుగులో వేసి తగినంత ఉప్పు చేర్చి కలుపుకోండి. అందులో తురిమిన కీరదోస చేర్చండి. ఆవాలు, మినపప్పును నూనెలో వేయించి పెరుగు మిశ్రమంలో కలపండి. పసందైన పెరుగుపచ్చడి రెడీ...