1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By Selvi
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2015 (15:12 IST)

నిమజ్జనం ఎలా చేయాలి? వినాయకుడిని జారవిడిచే ముందు..?

వినాయక చవితికి, దసరాకు నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయం. తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి.. ఆ తర్వాత దేవతా మూర్తులను నిమజ్జనం చేయడం అనాదిగా వస్తోంది. హైదరాబాదుతో పాటు పలు ప్రాంతాల్లో గణేశ నిమజ్జనం ఘనంగా నిర్వహిస్తారు. వినాయక చవితి నాడు కానీ 3, 5, 7, 9వ రోజు కానీ నిమజ్జనం నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య వున్న ఏ రోజైనా స్వామిని నిమజ్జనం చేయవచ్చు. 
 
నిమజ్జనం చేసేముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్థ ప్రసాదాలను అందరూ స్వీకరించి.. ఆ తర్వాత సంప్రదాయ బద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి. అయితే గణనాథుడ్ని నిమజ్జనం చేసేటప్పుడు, గణేశుడిని నీటిలోకి జారవిడిచే ముందు ''శ్రీ గణేశం ఉద్వాసయామి... శోభనార్థం పునరాగమనాయచ'' అని చెప్పడం సంప్రదాయం.