ఆఫీస్ టీమ్‌లో మహిళలు ఉండాల్సిందే.. ఇద్దరు మగాళ్లుంటే కష్టమే గురూ... అదే ఇద్దరు ఆడవాళ్లుంటే..?!

పురుషులకు సమానంగా ఆఫీసుల్లో మహిళలు పనిచేస్తున్నారు. ఇది ఒకందుకు మంచి వాతావరాణానికి సంకేతమేనని తాజా అధ్యయనంలో తేలింది. ఒక ఆఫీసులో ఆడవాళ్లు తప్పకుండా పనిచేయాలని, మహిళలున్న చోట వాతావరణం కూల్‌గా అయిపోతుంద

సోమవారం, 1 ఆగస్టు 2016 (17:09 IST)
పురుషులకు సమానంగా ఆఫీసుల్లో మహిళలు పనిచేస్తున్నారు. ఇది ఒకందుకు మంచి వాతావరాణానికి సంకేతమేనని తాజా అధ్యయనంలో తేలింది. ఒక ఆఫీసులో ఆడవాళ్లు తప్పకుండా పనిచేయాలని, మహిళలున్న చోట వాతావరణం కూల్‌గా అయిపోతుందని మార్కెటర్లు, మేనేజర్లు, వినియోగదారుల మధ్య నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంకా ఒక టీమ్‌లో అందరూ మగాళ్లే ఉంటే కష్టమని.. అదే ఆ టీములో మహిళ ఉంటే ఈజీగా పనైపోతుందని అమెరికాలోని కరోల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
 
ఇంకా ఈ పరిశోధనలో తేలిందేమిటంటే..? ఒక టీమ్‌లో ఇద్దరు మగాళ్లు ఉంటే ఏదైనా అంశంపై ఏకాభిప్రాయం కుదరడం అంత సులభం కాదని వెల్లడైంది. అదే ఇద్దరు వ్యక్తులు కలిగిన టీమ్‌లో ఒక మహిళ, ఒక పురుషుడు ఉంటే మాత్రం వారి అభిప్రాయాలు కలవకపోయినా రాజీ కుదురుతుందని పరిశోధకులు తేల్చేశారు. ఇంకా ఒక టీమ్‌లో పురుషులు మాత్రమే ఉన్న టీమ్‌లో ఒకరిపై ఒకరు పరస్పరం ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తారే తప్ప రాజీకి రారని తేలింది. 
 
అదే కనుక ఒక మహిళ జోక్యం చేసుకున్న టీమ్‌లో సత్వర నిర్ణయాలు లేదా ప్రత్యామ్నాయ మార్గాలు సులభంగా, స్వల్పకాలంలో కనుగొనడం జరిగినట్లు పరిశోధన వెల్లడించింది. ఇక ఒక టీమ్‌లో ఇద్దరే మహిళలున్నా సానుకూల ఫలితాలే వచ్చాయని, ఇద్దరు స్త్రీలే ఒక టీమ్‌లో పనిచేస్తే భేషజాలకు పోకుండా ఒకరికొకరు సహకరించుకుని పని పూర్తి చేసుకున్నారని పరిశోధకులు వెల్లడించారు. 1,204 మంది విద్యార్థులపై నాలుగు సార్లు, 673 మంది విద్యార్థులపై ఐదుసార్లు నిర్వహించిన ఈ పరిశోధనలో ఈ విషయం రూఢీ అయ్యిందని పరిశోధకులు చెప్తున్నారు.

అన్నీ చూడండి

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

అన్నీ చూడండి

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments