శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-08-2021 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. సూర్య నారాయణ పారాయణ చేసినట్లైతే..?

సూర్య నారాయణ పారాయణ చేసినా అన్నివిధాలా కలిసివస్తుంది. 
 
మేషం: వస్త్ర, ఫ్యాన్సీ మందులు, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడే వారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయం కాగలవు. గృహం ఏర్పరుచుకోవాలనే కోరిక బలపడుతుంది. 
 
వృషభం: ఉపాధ్యాయులు అధిక శ్రమ ఒత్తిడికి గురౌతారు. మీ మంచి తనమే మీకు శ్రీరామరక్ష. క్లిష్ట సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. విద్యార్థులకు నూతన పరిచయాలేర్పడతాయి. మీ యత్నాలకు సన్నిహితులు సహకరిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలం. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
మిథునం: ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా వుండటం శ్రేయస్కరం. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వృత్తుల వారికి కలిసిరాగలదు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయానికి కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులెదురవుతాయి. 
 
కర్కాటకం: పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారులకు శ్రమాధిక్యత మినహా ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. విద్యార్థులకు ప్రేమ విషయాల్లో భంగపాటు తప్పదు. క్రయ విక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ సంతానం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
సింహం: స్త్రీలకు పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. రుణయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు నిరుత్సాహానికి గురవుతారు. సహోద్యోగులతో సఖ్యత లోపిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
కన్య: కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి. తీర్థయాత్రలు, విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి విషయానికీ ఇతరులపై ఆధారపడే మీ ధోరణి మార్చుకోవడం శ్రేయస్కరం. నిరుద్యోగులకు రాత మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం. విందులు, వినోదాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. 
 
తుల: మీ కార్యక్రమాల్లో స్వల్ప మార్పులుంటాయి. వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారులకు, పనివారలకు, చికాకులు, పనిభారం తప్పవు. ఖర్చులు సామాన్యంగా వుంటాయి. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు, పనివారలకు చికాకులు, పనిభారం తప్పవు. ఖర్చులు సామాన్యంగా వుంటాయి. స్త్రీలకు ఆహార వ్యవహారాలతో ఏకాగ్రత వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. 
 
వృశ్చికం: కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పత్రికా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. చిన్నతరహా, కుటీర పరిశ్రమల వారికి ఆశాజనకం. మీ కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. పెద్దల ఆరోగ్యంలో గురించి ఆందోళన చెందుతారు. ఖర్చులు, చెల్లింపులు, ప్రయోజనకరంగా ఉంటాయి.
 
ధనస్సు: మీరు చేయబోయే మంచి పని విషయంలో అనుమానాలు విడనాడి శ్రమించండి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దల కలయిక సాధ్యపడదు. దుబారా ఖర్చులు అధికం. 
 
మకరం: ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. సేవా, సాంఘిక కార్యక్రమాల్లో హడావుడిగా వుంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా వుంటుంది. హోటల్, తినుబండారాలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండటం మంచిది. 
 
కుంభం: స్త్రీలు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. విందులు, వినోదాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. 
 
మీనం: కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి. స్త్రీలకు ఆత్మీయుల నుంచి ఆదరణ, బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి.