ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-10-2020 బుధవారం రాశిఫలాలు - సరస్వతిని పూజించినా సర్వదా శుభం...

మేషం : కుటుంబీకులతో కలిసి దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తరు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. గృహం ఏర్పరచుకోవాలనే కోరిక నెరవేరుతుంది. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. 
 
వృషభం : మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలుపెడతారు. దైవకార్యాలు, దీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం మొండివైఖరి వల్ల అసహనానికి లోనవుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. 
 
మిథునం : స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాక వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో విజయం సాధిస్తారు. భాగస్వామిక చర్చలు అనుకూలిస్తాయి. పాత రుణాలు తీరుస్తారు. 
 
కర్కాటకం : దైవ, సేవా పుణ్యకార్యాల్లో విజయం సాధిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.
 
సింహం : వస్త్ర, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధికానవస్తుంది. పెద్దలతో ఏకీభవించలేరు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. మీ కార్యక్రమాలు బంధువుల రాకతో మార్చుకోవలసి వస్తుంది. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
కన్య : బంధువులతో కలిసి వేడుకలలో పాల్గొంటారు. నూతన పనులకు శ్రీకారం చుడుతారు. మీ కార్యక్రమాల్లో స్వల్ప మార్పులుంటాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. కళ, సాంస్కృతిక, క్రీడా రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. 
 
తుల : దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. బంధుమిత్రులతో ఏకీభవించలేకపోతారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు చేబదుళ్లు స్వీకరిస్తారు. స్త్రీలకు బంధు వర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. 
 
వృశ్చికం : నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. క్రయ విక్రయాలు అధికంగా ఉంటాయి. మీ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు సమయం కలిసివస్తుంది. 
 
ధనస్సు : మీ సంతానం ఆరోగ్యం, ఆహార వ్యవహారాలలో మెళకువ అవసరం. మంచికిపోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో వస్తువులు పోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. 
 
మకరం : రవాణా రంగంలోని వారికి సంతృప్తి కానవస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. విదేశీయానం కోసం యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు స్వీయ అర్జనపట్ల ఆసక్తి , అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోపునరాలోచన మంచిది.
 
కుంభం : వాహనయోగం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది. అదనపు సౌకర్యాలు సమకూర్చుకుంటారు. 
 
మీనం : మీ చిన్నారుల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామికులతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం క్షేమదాయకం. దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.