శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (09:47 IST)

16-10-2020 శుక్రవారం రాశిఫలాలు - పార్వతీదేవిని పూజించిన మనోవాంఛలు...(video)

మేషం : ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకువేస్తారు. వృత్తుల్లో వారికి టెక్నికల్ రంగాల్లో వారికి అధిక ఒత్తిడి, చికాకు తప్పదు. మీ మంచితనమే మీకు శ్రీరామరక్షగా ఉంటుంది. భాగస్వామికుల మధ్య విభేదాలు పట్టింపులు తలెత్తే ఆస్కారం ఉంది. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. 
 
వృషభం : రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. ఎదుటివారికి వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రైవేటు పత్రికా రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తప్పవు. స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. 
 
మిథునం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటుకు బదిలీ వంటి శుభపరిణామాలు ఉంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
కర్కాటకం : చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండం మంచిది. మీపై సన్నిహితుల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. 
 
సింహం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. రావలసిన ధనం అందకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. దైవ కార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. 
 
కన్య : అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కివస్తాయి. ఒక వ్యవహారంలో సోదరుల నుంచి పట్టింపులు, వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
తుల : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెళకువ వహించండి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉల్లి, బెల్లం, పసుపు, కంది, మిర్చి వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు లాభదాయకం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
వృశ్చికం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. చిన్నారులకు బహుమతులు అందిస్తారు. అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ వాక్ చాతుర్యానికి మంచితనానికి గుర్తింపు లభిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
ధనస్సు : స్థిర, చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనం నడుపునపుడు మెళకువ చాలా అవసరం. ఉద్యోగస్తుల తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని చేపట్టిన పనులు పూర్తికావు. 
 
మకరం : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ల, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. 
 
కుంభం : ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. 
 
మీనం : హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. మిత్రుల సహకారంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. బ్యాంకింగ్ పనుల మందకొడిగా సాగుతాయి. ఇతరుల వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు.