ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-10-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు.. సూర్యస్తుతితో శుభం

సూర్య స్తుతితో శుభం కలుగుతుంది. 
 
మేషం: ప్రయాణాల్లో అసౌక్యర్యానికి లోనవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చేటప్పుడు లౌక్యంగా వ్యవహరించండి. అపరిచిత వ్యక్తులతో ఆచితూచి  సంభాషించండి. స్త్రీల కోరికలు, మనోవాంఛలు నెరవేరగలవు. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది.
 
వృషభం: బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. వాదనలు, పోట్లాటల్లో మీ శక్తిని వృధా చేసుకుంటారు. పెద్దల ఆహార, ఆరోగ్యంలో మెలకువ చాలా అవసరం. మీ సంతానం మొండితనం అసహనానికి గురవుతారు. దైవదర్శనాల్లో చికాకు లెదురవుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు.
 
మిథునం: చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. పాత రుణాలు తీరుస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
కర్కాటకం: లౌక్యం, సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. దైవరాధాన వల్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు.  
 
సింహం: ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కుటుంబీకులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రాజకీయనాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కన్య: స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తప్పవు మెళకువ వహించండి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. ప్రముఖుల కలయిక మీ కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
 
తుల: ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. దూర ప్రయాణాల్లో పరిచయాలేర్పడతాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. పాత మిత్రులను కలుసుకుంటారు. 
 
వృశ్చికం: బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
ధనస్సు: విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. రవాణా రంగంలో వారికి సంతృప్తి. బంధువుల రాకవల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. సభలు, సమావేశాల్లో మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం.  
 
మకరం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. కొన్ని వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి గణనీయమైన అభివృద్ధి. దైవ, సేవాకార్యక్రమాల్లో దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. 
 
కుంభం: స్త్రీలు పనివారల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు తరచు సభాసమావేశాల్లో పాల్గొంటారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
మీనం: కుటుంబీకులను అనుమానించడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. మీ సంతానం వివాహ, విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.