శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-04-2021 శనివారం దినఫలాలు - నారాయణ స్వామిని ఆరాధిస్తే...

మేషం : దైవా, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం చేజిక్కించుకుంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. వివాహ, విదేశీయానం, రుణ యత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగ ప్రకటనలపై మెళకువ వహించండి. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. 
 
వృషభం : మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, కాంట్రాక్టులకు అనుకూలం. ప్రయాణాలలో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. షాపుల స్థల మార్పు, అలంకరణతో క్రయ, విక్రయాలు ఊపందుకుంటాయి. 
 
మిథునం : ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది. 
 
కర్కాటకం : మీ రాక బంధు మిత్రులకు సంతోషం కలిగిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రస్తుత వ్యాపారలపైనే శ్రద్ధ వహించండి. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండాలి. కార్పొరేట్ సంస్థల్లో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. 
 
సింహం : ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, అధికారులతో చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి తప్పుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. నేడు అనుకూలించని అవకాశం రేపు కలిసివస్తుంది. 
 
కన్య : బంధువుల రాకతో పనులు కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. అవసరానికి ధనం అందుతుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. స్థిరాస్తి విక్రయంలో తొందరపాటు తగదు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ ఆలోచనలు పథకాలు కార్యరూపం దాల్చుతాయి. 
 
తుల : వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పనులు మొదలెట్టే సమయానికి ఆటంకాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. భాగస్వామిక సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం : పెద్ద సంస్థల్లో భాగస్వామ్యం లభిస్తుంది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. కోర్టు వాయిదాలకు హాజరువుతారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. అవసరాలకు డబ్బు సర్దుబాటు చేసుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
ధనస్సు : మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. సంతానం పై చదువుల విషయం వారి ఇష్టానికే వదిలివేయండి. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మీ సమర్థతకు గుర్తింపు, అవకాశాలు కనిపిస్తాయి. 
 
మకరం : ఆదాయ వ్యాయాలు ఫర్వాలేదనిపిస్తాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. గృహ నిర్మాణ ప్లానుకు ఆమోదం. రుణాలు మంజూరవుతాయి. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం చేజిక్కించుకోవాలి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత, మెళకువ వహించండి. 
 
కుంభం : ఆర్థిక విషయాల్లో మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. బంధు మిత్రులతో ఏకీభవించలేకపోతారు. విలువైన పత్రాలు, నోటీసులు అందుకుంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచింది. 
 
మీనం : మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. మీ మనోనిబ్బరం, ధైర్యం ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.