శనివారం, 4 అక్టోబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 27 సెప్టెంబరు 2025 (20:00 IST)

28-09-2025 నుంచి 04-10-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆచితూచి అడుగేయండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. చేపట్టిన పనులపై దృష్టిపెట్టండి. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అవగాహనతోనే నూతన యత్నాలు మొదలెట్టండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. దళారుల మాటలు విశ్వసించవద్దు. అవతలి వారి స్తోమతు క్షుణ్ణంగా తెలుసుకోండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు కొంతమేరకు సత్ఫలితాలిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. దైవదర్శనాల్లో అవస్థలు తప్పవు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. పనుల్లో ఏకాగ్రత, ఓర్పు ప్రధానం. ఆరోగ్యం బాగుంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆపన్నులకు సాయం అందిస్తారు. దంపతుల అవగాహన లోపం. చీటికిమాటికి అసనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మంగళవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండిగా వ్యవహరిస్తారు. సన్నిహితుల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య స్వల్ప కలహం. సామరస్యంగా మెలగండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆదివారం నాడు అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలు తెలుసుకోండి. అనాలోచిత నిర్ణయం తగదు. ఉద్యోగస్తులకు ఇబ్బందులెదురవుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలందిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహబలం అనుకూలంగా ఉంది. లక్ష్యానికి చేరువవుతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. సంతానానికి శుభయోగం. వివాహయత్నం ఫలిస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహమార్పు అనివార్యం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటంకాలకు దీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తులకు ఓర్పు, పనియందు ధ్యాస ప్రధానం. ఉపాధి పథకాలు చేపడతారు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆర్థికంగా బాగుంటుంది. రుణవిముక్తులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తుంటారు. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. కీలక పత్రాలు, నగదు జాగ్రత్త. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంకల్పబలంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అవసరాలకు ధనం అందుతుంది. మంగళవారం నాడు ముఖ్యుల సందర్శనం వీలుపడదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూల సమయం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు కొత్త బాధ్యతలు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. మీ శక్తిసామర్ధ్యాలపై నమ్మకం పెంచుకోండి. ఎవరి సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం, చేతిలో ధనం నిలవదు. ఆపత్సమయంలో సన్నిహితులు ఆడుకుంటారు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దంపతుల మధ్య స్వల్ప కలహం. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఒక నష్టాన్ని మరో విధంగా భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ధనయోగం. ఉపాధ్యాయులకు పనిభారం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పెట్టుబడులకు తగిన సమయం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
గ్రహానుకూలత ఉంది. కుటుంబసౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కొత్తపనులు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. శుక్రవారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. ధైర్యంగా ముందుకు సాగుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరువ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. దైవకార్యంలో పాల్గొంటారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థిక లాభాలుంటాయి. రావలసిన ధనం అందుతుంది. నగదు లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. వేడుకను ఘనంగా చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్ధికాదు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సంతానం దుడుకుతనం వివాదాస్పదమవుతుంది. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, అధికారులకు హోదామార్పు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రుణ సమస్యల నుంచి గట్టెక్కుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు సంకల్పబలం ప్రధానం. ప్రారంభించిన యత్నాలు విరమించుకయోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సామరస్యంగా తెలియజేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. మంగళవారం నాడు పనులు పురమాయించవద్దు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సంతానానికి శుభయోగం. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హెల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. దైవదర్శనాల్లో అవస్థలెదుర్కుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆదాయం సంతృప్తికరం. రుణసమస్యలు తొలగుతాయి. బంధుమిత్రులతో తరచుగా సంభాషిస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఆర్ధిక వివరాలు వెల్లడించవద్దు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ప్రముఖులతో సంద్రింపులు జరుపుతారు. సమయస్ఫూర్తితో మెలగండి. మీ నిర్ణయంపై కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు పనిభారం. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ వారం ఆచితూచి అడుగేయాల్సిన సమయం. ఆగ్రహావేశాలకు లోనుకావద్దు. అందరితోను సామరస్యంగా మెలగండి. మీ తప్పిదాలు సరిదిద్దుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అదుపులో ఉండదు. అవసరాలకు ధనం అందుతుంది. కొందరి రాక అసహనం కలిగిస్తుంది. చేపట్టిన పనులు అర్ధాంతంగా ముగిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఇదీ ఒకందుకు మంచికే. త్వరలో శుభవార్త వింటారు. ఉద్యోగసులు అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. నిర్మాణాలు జోరుగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికుల ఆదాయం బాగుంటుంది.