శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-09-2020 శనివారం దినఫలాలు - అభయ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే..

మేషం : ఆర్థికస్థితిలో పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. గృహమార్పునకు యత్నించండి. వాణజ్య ఒప్పందాలు, చెల్లింపులు, నగదు స్వీకరణలో మెళకువ వహించండి. ఉపాధ్యాయులతో మితంగా సంభాషించండి. బంధు మిత్రులతో సంబంధాలు బలపడతాయి. 
 
వృషభం : ఆకస్మిక ఖర్చులు ఉంటాయి. ధనవ్యయంలో మితం పాటించండి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి అవకాశాలు కలసివస్తాయి. కోర్టు వాయిదాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. చేపట్టిన పనులపై ఆసక్తి ఉండదు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. 
 
మిథునం : బాకీలు, ఇతరాత్రా రావలసిన ఆదాయం అందుతుంది. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీల ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం : చిన్న విషయమే సమస్యగా మారే అవకాశం ఉంది. పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండాలి. ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టిసారించండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
సింహం : ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. పనులు సానుకూలతకు బాగా శ్రమిస్తారు. చిన్న విషయమే సమస్యగా మారే ఆస్కారం ఉంది. విందులలో పరిమితి పాటించండి. ఉద్యోగస్తులకు దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. రావలసిన ఆదాయంలో కొంత మొత్తం అందుతుంది. 
 
కన్య : ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు సానుకూలమవుతాయి. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికమవుతాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఉన్నత విద్యల కోసం చేసే యత్నం ఫలిస్తుంది. 
 
తుల : వాణిజ్య కార్యకలాపాలు మెరుగుపడతాయి. ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులు అధికం. 
 
వృశ్చికం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తికానవస్తుంది. రావలసిన ధనం అందడం వల్ల తాకట్టు వస్తువులను విడిపిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
ధనస్సు : బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఒకసారి అనుకూలించని అవకాశం మరోసారి ఫలిస్తుంది. దైవ, సేవా, కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. గృహమునకు కావలసిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
మకరం : కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు సామాన్యంగా ఉండగలదు. రుణాల కోసం అన్వేషిస్తారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ చాలా అవసరం. 
 
కుంభం : ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పట్టింపులు చోటుచేసుకుంటాయ. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. అధికారులు ధనప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. 
 
మీనం : రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్యానం చూసుకోవడం ఉత్తమం. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.