గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 జనవరి 2025 (14:36 IST)

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

Crystal Turtle Tortoise
Crystal Turtle Tortoise
తాబేలు పెట్టుకోవడం వల్ల ఇంట్లో డబ్బుకు ఇబ్బంది వుండదని వాస్తు నిపుణులు, ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇంట్లో తాబేలును ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ భావన ఉంటుందని నమ్ముతారు.
 
అలాగే ఇంట్లో, ఆఫీసులో తాబేలు ఉంచండి.. తాబేలును ఆఫీసు లోపల, ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.  విష్ణువు కూర్మ రూపంలో అవతరించాడు. అందుకే తాబేలును కూర్మావతారం అని కూడా అంటారు. ఇంట్లో లేదా కార్యాలయంలో తాబేలును ఉంచడం ద్వారా, నిలిచిపోయిన పని పూర్తవుతుందని.. విజయం వరిస్తుందని చెబుతారు. నీటిలోఎక్కువ కాలం జీవించే ఏకైక జంతువు తాబేలు. 
 
అలాంటి తాబేలును ఇంట్లో పూజా స్థలంలో లోహంతో చేసిన తాబేలును ఉంచవచ్చు. ఉత్తర దిశలో.. తాబేలును ఉత్తరాన ఉంచడం శుభప్రదం. ఎందుకంటే ఉత్తర దిశను లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు. తాబేలును ఈ దిశలో ఉంచడం వల్ల వ్యాపారంలో విజయం, సంపద చేకూరుతుంది. శత్రుబాధ వుండదు.
 
అయితే తాబేలును నీరు లేకుండా ఉంచవద్దు. నీటిలో ఉంచడం శుభప్రదం. ఆర్థిక ఇబ్బందులను  ఎదుర్కొనే వారు.. అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు క్రిస్టల్ తాబేలును ఇంటికి తీసుకురావాలి. తాబేలు ముఖాన్ని ఎల్లప్పుడూ ఇంటి లోపలి వైపు వుండేలా ఉంచడం ప్రయోజనకరం. కానీ పడకగదిలో పెట్టవద్దు.. తాబేలును డ్రాయింగ్ రూమ్‌లో ఉంచాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.