బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-01-2025 గురువారం దినఫలితాలు : బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. దూరపు బంధువులతో సంభాషిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రముఖులతో వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులు మొదలెడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పందాలు, క్రీడాపోటీల్లో పాల్గొంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటారు. ఖర్చులు విపరీత. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. వేడుకకు హాజరవుతారు. బెట్టింగులకు పాల్పవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కీలక వ్యవహారాలతో తీరిక ఉండదు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సంఘటను మీపై ప్రభావం చూపుతుంది. నోటీసులు అందుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు విపరీతం. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఎడ్లపందాలు, క్రీడాపోటీల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ప్రయాణంలో కొత్త వారితో జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్తవారితో మితంగా సంభాషించండి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ప్రయాణం తలపెడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. లావాదేవీలు పురోగతిన సాగుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. కళాత్మక పోటీల్లో స్త్రీలు విజయం సాధిస్తారు. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యక్రమం విజయవంతమవుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. పరిచయాలు బలపడతాయి. మొండిగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పుతో శ్రమించండి. ఊహించని ఖర్చులు అదుపులో ఉండవు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనులు సానుకూలమవుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.