1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-07-2025 శుక్రవారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగులకు జోలికి పోవద్దు

Horoscope nakshatra
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులు అనుకూలించవు. ఆచితూచి వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలను అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. మీ జోక్యం అనివార్యం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. విందులకు హాజరవుతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు
సంప్రదింపులతో తీరిక ఉండదు. అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. కొంతమంది వ్యాఖ్యలు బాధిస్తాయి. ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఖర్చులు అధికం. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఖర్చులు విపరీతం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యమైన, సమావేశంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. సమస్యల నుంచి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు సానుకూలమవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. ఏ పని మొదలెట్టినా మొదటికే వస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండేందుకు యత్నించండి. ఊహించని ఖర్చు చికాకుపరుస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. పనులు ముందుకు సాగవు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు విపరీతం. ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. కీలక పత్రాలు అందుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. సమర్ధతకు గుర్తింపు ఉండదు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలెదురవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఫోన్ సందేశాలు నమ్మవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు ప్రయోజనకరం. సన్నిహితులను విందుకు ఆహ్వానిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వాహనం ఇతరులకివ్వవద్దు.