ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-09-2024 శుక్రవారం దినఫలితాలు : మానసికంగా కుదుటపడతారు...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పనులు సానుకూలమవుతాయి. దుబారా ఖర్చులు అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగతాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విందులు, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. ఖర్చులు అధికం. వివాహయత్నం ఫలిస్తుంది. అవతలి వారి స్థితిగతులను క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ నిర్ణయంపైనే కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పెద్దల సలహా పాటించండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. రుణాలు, చేబదుళ్లు తప్పవు. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. చేసిన పనులే చేయవలసి వస్తుంది. చీటికి మాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పు, పట్టుదలతో మెలగండి. ఒత్తిళ్లకు గురికావద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వ్యవహారాలతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. రుణ సమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
బాధ్యతగా మెలగండి. ముఖ్యమైన పనులు మీరు చేసుకోవటమే శ్రేయస్కరం. ఇతరుల జోలికి పోవద్దు. నోటీసులు అందుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. సమర్ధతను చాటుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఉద్యోగపరంగా మార్పులుంటాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. రుణసమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగాల్లో రాణిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆచితూచి అడుగేయండి. ధనసహాయం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నూతన యత్నాలకు మీ శ్రీమతి ప్రోత్సాహం అవసరం. అనాలోచిత నిర్ణయాలు తగవు. సంతానం భవిష్యతుపై దృష్టిపెట్టండి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్తవారితో మితంగా సంభాషించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త.