గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-09-2024 ఆదివారం దినఫలితాలు - నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. పిల్లలచదువులపై దృష్టి పెడతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన పనులు మాత్రమే చేపట్టండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి స్థితిగతులను క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ నిర్ణయంపైనే కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ కష్టం ఫలిస్తుంది. మాటతీరు ఆకట్టుకుంటుంది. వేడుకకు హాజరవుతారు. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు ఒక పట్టాన పూర్తికావు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. గృహమరమ్మతులు చేపడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆందోళనకు గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సన్నిహితులను కలుసుకుంటారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహా పాటిచంచండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆశావహదృక్పధంతో మెలగండి. ఎత్తిపొడుపు మాటలు పట్టించుకోవద్దు. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. భేషజాలకు పోయి ఇబ్బందులకు గురవుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
చీటికిమాటికి చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర విషయాల జోలికి పోవద్దు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పువస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగల్గుతారు. వాయిదాలు చెల్లింపుల్లో జాప్యం తగదు. ముఖ్యులను కలిసినా ప్రయోజనం ఉండదు. సంతానం యత్నం ఫలిస్తుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగపరంగా ఆశించిన మార్పులుంటాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. కీలక విషయాల్లో పెద్దలను సంప్రదిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి తీరుకు అనుగుణంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. పనులు, కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆచితూచి అడుగేయండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సన్నిహితుల హితవు మీ పై పనిచేస్తుంది. ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. పట్టుదలతో కార్యాన్ని సాధిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచించండి.