మంగళవారం, 12 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-09-2024 బుధవారం రాశిఫలాలు - తలపెట్టిన కార్యం ఫలిస్తుంది...

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు సామాన్యం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సమర్థతను చాటుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఖర్చులు విపరీతం. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగండి. సంతానానికి ఉద్యోగయోగం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. కొత్త పరిచయాలేర్పడతాయి. ఒక సమాచారం ఉత్కంఠ కలిగిస్తుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం ఫలిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనల్లో మార్పు వస్తుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆర్థికవ్యవహారాల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు.. రుణ సమస్యలు వేధిసాయి. పట్టుదలతో శ్రమించినగాని పనులు కావు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ముందుకు సాగవు. అన్యమస్కంగా గడుపుతారు. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. వేడుకకు హాజరుకాలేరు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి సారిస్తారు. పనులు సకాలంలో పనులు పూర్తవుతాయి. పత్రాలు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలు తెలుసుకోండి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. మితంగా సంభాషించండి. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణంలో జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో అడుగులేస్తారు. మీ కష్టం వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. అనవసర జోక్యం తగదు. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఏకాగ్రతతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అవకాశాలను వదులుకోవద్దు. పనులు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు తగ్గించుకుంటారు. అనవసర జోక్యం తగదు. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలు పలు విధాలుగా ఉంటతాయి. మనోధైర్యంతో మెలగండి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సన్నిహితుల హితవు మీపై పనిచేస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.