బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (08:42 IST)

01-09-2024 ఆదివారం రాశిఫలాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. పనుల నోటీసులు అందుకుంటారు. సానుకూలతకు ఓర్పు ప్రధానం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంప్రదింపులకు అనుకూలం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అర్థాంతంగా ముగిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగుంటుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కొత్తయత్నాలు ప్రారంభిస్తారు. బంధువుల రాక అసౌకర్యం కలిగిస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు దనసహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం చేయంండి. కీలక పత్రాలు అందుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోనుకావద్దు. అపరిచితులతో మితంగా సంభాషించండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. మొక్కుబడిగా పనులు పూర్తిచేస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ నిజాయితీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవకాశాలు కలిసివస్తాయి. అతిగా శ్రమించవద్దు. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. పనుల్లో స్వల్ప ఆటంకాలెదురవుతాయి. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా యత్నాలు కొనసాగించండి. ప్రయాణం తలపెడతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకున్నది సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సేవ, దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. పట్టుదలతో శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది. ఆదాయం సామాన్యం. పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. సన్నిహితుల వ్యాఖ్యలకు ప్రభావితమవుతారు. వాహనదారులకు అత్యుత్సాహం తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. ఊహించిన ఖర్చులే ఉన్నాయి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం అవసరం. పొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. విమర్శలు పట్టించుకోవద్దు.