గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-08-2024 మంగళవారం దినఫలాలు - చిరకాలం వేధిస్తున్న సమస్యలు..?

Astrology
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ ఐ|| అష్టమి ఉ.6.48 నవమి తె.5.26 రోహిణి రా.8.35  ప.వ.12.53 ల 2.25 రా.వ.2.04 ల 3.38. ఉ.దు. 8.16 ల 9.07 రా.దు. 10. 58 ల 11.43.
 
మేషం:– ఆర్ధిక విషయాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటారు. రాజకీయనాయకులకు పదవి సమస్యలు అధికమవుతాయి. మీ జీవిత భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్థిరచరాస్తులక్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలు విదేశీయవస్తువులపట్ల ఆకర్షితులవుతారు.
 
వృషభం :- బ్యాంకు వ్యవహారాల్లో మెళుకువ అవసరం. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు నెమ్మదిగా తీరుతాయి. క్రయ, విక్రయ రంగాల్లో వారికి సంతృప్తి కానరాగలదు. ఉద్యోగస్తులు పనిభారం వల్ల అశాంతికి లోనవుతారు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. 
 
మిధునం:- ప్రైవేటు విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. వాహన చోదకులఅత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు.
 
కర్కాటకం:- రావలసిన బకాయిలు సకాలంలో అందినా ధనం ఏమాత్రం నిల్వ చేయ లేకపోతారు. కళత్ర మొండి వైఖరి మీకు చికాకును కలిగిస్తుంది. చేపట్టిన పనులలో చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ఖర్చులు మీ స్తోమతకు తగినట్లుగానే ఉంటాయి.
 
సింహం: = ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ప్రైవేటు సంస్థలలోనివారికి యాజమానంతో ఏకీభావం లోపిస్తుంది. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు సమసిపోతాయి. వైద్యరంగాల్లోనివారికి శస్త్రచికిత్సలసమమంలో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి.
 
కన్య:- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. స్త్రీలకు అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు కలిసిరాగలదు. బ్యాంకు రుణాలు తీర్చడంతో పాటు కొంత రుణం తీసుకుంటారు. బంధువుల మధ్య సయోధ్య లోపిస్తుంది.
 
తుల:- ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. వ్యాపారాల అభివృద్ధికిచేపట్టిన పథకాలు మునుముందు మంచి ఫలితాలనిస్తాయి. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరాలోచన మంచిది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
వృశ్చికం:- గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. పండ్లు, పూలు, కొబ్బరి పానియ వ్యాపారులకు లాభదాయకం. మనసు లగ్నము చేసి, పనిపై శ్రద్ద పెట్టినా ఆశించిన ఫలితాలు పొందుతారు.
 
ధనస్సు:- ప్రయాణాలు, ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. బంధు వర్గాలతో అభిప్రాయ భేదాలు తప్పవు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, బేకరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి.
 
మకరం:– చిట్స్, ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. గృహ అవసరాలకునిధులు సమకూరుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భము లందు ధననష్టము సంభవించును. ప్రయాణాలలోనూ, ఆలయ సందర్శనాలలో మెళుకువ అవసరం.
 
కుంభం:- వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపులవల్ల ఆటుపోట్లు తప్పవు. సోదరీ, సోదరులతో ఏకీభవించ లేకపోతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
మీనం:- ఆర్ధిక లావాదేవీలు, కీలకమైన వ్యవహరాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం. బంధువులరాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ శ్రీమతి మొండివైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు.