శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-08-2024 గురువారం దినఫలాలు - మీ శ్రీమతికి మీరంటే..?

Astrology
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ బ|| తదియ సా.5.57 ఉత్తరాభాద్ర తె.3.16 ప.వ.1.52 ల 3.21. ఉ.దు. 9.58 ల 10.49 ప.దు. 3.05 ల3.57.
 
మేషం: స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఎదుటివారితో మితంగా సంభాషించటం క్షేమదాయకం. గతంలో నిలిపివేసిన పనులు పున ప్రారంభిస్తారు. వైద్య రంగాల వారికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. బ్యాంకు లోన్లు, పర్మిట్లు మంజూరవుతాయి. కాంట్రాక్టర్లకు ప్రయత్నపూర్వకంగా టెండర్లు అనుకూలిస్తాయి.
 
వృషభం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగుల ఇంటర్వ్యూ తేలికగా లభిస్తుంది. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా పుంజుకుంటారు. వృత్తుల వారి శ్రమకుతగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆధ్యాత్మిక, సేవా, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
 
మిధునం:- ఆలయాలను సందర్శిస్తారు. మధ్య కలహాలు అధికమువుతాయి. మొండి బాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు. మీరు, మీ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషిచేస్తారు. స్త్రీల అతి ఉత్సాహం అనర్ధాలకు దారితీసే ఆస్కారం ఉంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
కర్కాటకం:- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. కొబ్బరి, పండు, పానీయ వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. రావలసిన ధనం ఆకస్మికంగా అందుకుంటారు.
 
సింహం:- స్త్రీలు విలువైన వస్తువులు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. ట్రాన్సుపోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
కన్య:- ఆర్ధికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. సినిమా, విద్యా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మికంగా ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు కొత్త అధికారులకు మరింత సన్నిహితులవుతారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. మీ సంతానం భవిష్యత్తు గురించి కొత్త పథకాలు వేస్తారు.
 
తుల:- నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు.
 
వృశ్చికం: లౌక్యంగా వ్యవహరించటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
ధనస్సు:- ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి విధినిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. దైవ, పుణ్య, సేవా కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. విద్యార్థులకు తోటి విద్యార్థుల వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
మకరం: రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బందికలిగిస్తుంది. వస్త్ర, బంగారం, వెండి, నిత్యావసర వస్తువుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఇండర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం.
 
కుంభం:- వాహనం కొనుగోలు యత్నం ఫలిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. విద్యార్థులకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.
 
మీనం:- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.