గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-08-2024 సోమవారం దినఫలాలు - కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు...

astro8
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ శు॥ పూర్ణిమ రా.12.43 శ్రవణం ఉ.9.04 ప.వ.12.52ల 2.23. ప.దు. 12.31 ల 1.22 పు.దు. 3.04 3.55.
 
మేషం :- కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పత్రికా రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. సోదరీమణులకు విలువైన కానుకలు అందిస్తారు.
 
వృషభం :- ఆర్థిక విషయాలలో జయం చేకూరుతుంది. సోదరీ, సోదరులతో సమస్యలు తలెత్తుతాయి. సంఘంలో మీకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ప్రేమికుల తొందరపాటు చర్యలు సమస్యలకు దారితీస్తాయి. కుటుంబీకుల మధ్య అవగాహన, ఏకాభిప్రాయం సానుకూలమవుతాయి. మీ కళత్ర మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. 
 
మిథునం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది. విందులలో పాల్గొంటారు. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. అధికారులకు సాంస్కృతిక కార్యక్రమాలతో క్షణం తీరిక ఉండదు. 
 
కర్కాటకం :- ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. రిప్రజెంటివ్‌లకు ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసి వస్తుంది.
 
సింహం :- రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. మీ సంతానం మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్, వృత్తుల వారికి పురోభివృద్ధి.
 
కన్య :- ఎంతో శ్రమించిన మీదట కాని అనుకున్నది సాధించలేరు. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. విదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరీ, సోదరులకు శుభాకాంక్షలు అందజేస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
తుల :- ఆర్థిక వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీల మనోభావాలకు గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
వృశ్చికం :- సంఘంలో వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. ఒకేసారి అనేక ఖర్చులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు. మీ ఆశయాలు, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. 
 
ధనస్సు :- ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే స్త్రీల మనోవాంఛ ఫలిస్తుంది. కీలకమైన సమావేశాల్లో మితంగా సంభాషించండి. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు వెల్లివిరుస్తాయి. నిత్యావసర సరుకులస్టాకిస్టులకు వేధింపులు తప్పవు. దూరప్రయాణాలలో చికాకులు తలెత్తుతాయి.
 
మకరం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీల అతిఉత్సాహం అనర్థాలకు దారితీస్తే ఆస్కారం ఉంది. మధ్య కలహాలు అధికమువుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మొండి బాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. మీరు, మీ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషిచేస్తారు.
 
కుంభం :- ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు సంభవిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చుచేస్తారు. స్థిరాస్తుల వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
మీనం :- ఇళ్ళ స్థలాల బ్రోకర్లకు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. రవాణా రంగాలలో వారికి మిశ్రమ ఫలితం కానవస్తుంది.