ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-08-2024 సోమవారం దినఫలాలు - విద్యార్థులు క్రీడల్లో బాగా రాణిస్తారు...

horoscope
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ బ|| సప్తమి ఉ.8.39 కృత్తిక రా.9.28 ఉ.వ.10.03 ల 11.34. ప.దు. 12.31 ల 1.22 పు.దు. 3.04 3.55.
 
మేషం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు అనుకూలించవు. పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారస్తులకు లాభదాయకం. ప్రయాణాలు అనుకూలం. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. మీ కళత్ర మొండివైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆహార వ్యవహారాలలో మెళుకువ వహించండి. 
 
వృషభం :- బంధువుల వైఖరి నిరుత్సాహ పరుస్తుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సఖ్యత లోపిస్తుంది. రాజకీయ నాయకులు తరచు సభ, సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులు క్రీడా రంగాలలో బాగా రాణిస్తారు. మిత్రులతో కలసి వేడుకలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అసవరం.
 
మిథునం :- నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు.
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఏదన్నా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. ఒక్కసారి ప్రేమిస్తేదాన్ని నిలబెట్టుకొవడానికి ఎంతైనా పోరాడతారు. బంధువురాక వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు.
 
సింహం :- ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. ఇతర విషయాలపై ఆసక్తిని తగ్గించి, స్వవిషయాలపై శ్రద్ధ పెడితే మంచిది. కుటుంబములో అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఒక్కసారి ప్రేమిస్తే దాన్ని నిలబెట్టు కొవడానికి ఎంతైనా పోరాడుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కన్య :- చేతి వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికమవుతాయి. స్థిర బుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. ఉమ్మడి వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది.
 
తుల :- వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు శక్తివంచన లేకుండా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. అధిక మొత్తంలో ఋణం చేయవలసివస్తుంది. బంధు మిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం, ఉత్సాహం సంతరించుకుంటాయి. శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది.
 
వృశ్చికం :- మీ ఉన్నతిని చాటుకోడటం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలిగిపోగలవు. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. 
 
ధనస్సు :- బంధు మిత్రులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీ మాటకు అన్ని చోట్ల మంచి స్పందన లభిస్తుంది. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. గృహనిర్మాణాలు, మరమత్తులు ఆశించినంత చురుకుగా సాగవు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి అంచనాలు ఫలిస్తాయి.
 
మకరం :- రాజకీయ నాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. రవాణా రంగాలవారికి చికాకులు అధికం. స్త్రీలకు టి.వి కార్యక్రమాల సమాచారం అందుతుంది. ద్విచక్రవాహనం పై దూర ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. పత్రికా సంస్థలలోని వారికి సహోద్యోగుల ధోరణి ఇబ్బంది కలిగిస్తుంది.
 
కుంభం :- కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. ముఖ్యమైన విషయాలలో కుటుంబీకుల సలహాలను తీసుకోవడం చాలా మంచిది. పాత జ్ఞాపకాలు, ఆలోచనలు మిమ్మల్ని గతంలోకి తీసుకువెళ్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. చేసే పనిపై శ్రద్ధ పెట్టి ఆశించిన ఫలితాలు వచ్చేవరకు శ్రమించండి. 
 
మీనం :- బంధువుల రాకతోగృహంలో సందడి కావస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలోను, అలంకారాల పట్ల, విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మికంగా దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. మీ ప్రేమ మీ జీవితంలో మరింత ఆనందాన్ని నింపుతుంది.