ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-08-2024 బుధవారం దినఫలాలు - క్యాటరింగ్ పౌరులకు కలిసివస్తుంది...

horoscope
శ్రీ క్రోధినామ సం|| శ్రావణ ఐ|| దశమి తె.4.21 మృగశిర రా.8.05 తె.వ.4.28 ల 3.5.11.40 12.31.
 
మేషం :- హోటల్, క్యాటరింగ్, తినుబండారు వ్యాపారులకు కలిసివస్తుంది. మీ అలవాట్లు, మాటతీరు ఇబ్బందులకు దారితీస్తుంది. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. సన్నిహితుల సలహాను పాటించి ఒకసమస్యను అధికమిస్తారు. ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
వృషభం :- కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. మీ మాటకు సంఘంలోనూ, కుటుంబంలోనూ ఆమోదం లభిస్తుంది. భాగస్వామిక చర్చలు వాయిదాపడటం మంచిదని గమనించండి. వృత్తుల వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. 
 
మిథునం :- వాతావరణంలోని మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
కర్కాటకం :- స్త్రీలు చొరవగా వ్యవహరించి ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహకారం అందిస్తారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువఅవసరం. ప్రభుత్వ అధికారులకుపనివారితో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీయత్నం ఫలించదు.
 
సింహం :- మీ సమస్యలను ఆత్మీయులకు చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉమ్మడి ఆస్తి విక్రయాల్లో సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కుంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. 
 
కన్య :- ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుట వల్ల ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి పనిభారం అధికమవుతుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.
 
తుల :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యములో సంతృప్తి కావస్తుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. నిత్యవసర స్టాకిస్తులకు, రేషన్ డీలర్లకు చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
వృశ్చికం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. బంధు మిత్రుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. హామీల విషయంలో జాగ్రత్త వహించండి.
 
ధనస్సు :- ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు ఉంటాయి. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళుకువ అవరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. సోదరీ సోదరులతో ఏకీభవించ లేకపోతారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్రముఖుల కలియికతో పనులు సానుకూలమవుతాయి.
 
మకరం :- వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి పొందుతారు. నూతన టెండర్ల వ్యవహారంలో ఏకాగ్రత, విషయ పరిజ్ఞానం అవసరం. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలో ఏకాగ్రత ముఖ్యం.
 
కుంభం :- ప్రియతములుఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తి నిస్తుంది. వాహన చోదకులకు ఊహించని చికాకు లెదుర్కోవలసివస్తుంది. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ముందుచూపుతో ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితానిస్తుంది. విద్యార్థులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు.
 
మీనం :- స్త్రీలకు బంగారం, నూతనవస్త్రాలపై మక్కువ పెరుగుతుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆశించినంత లాభసాటిగా ఉండదు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయానంచేయాల్సివస్తుంది. కోర్టు వ్యవహరాల్లో ఫలితాలుమీకు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం.