ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-09-2024 మంగళవారం రాశిఫలాలు - ఖర్చులు అదుపులో ఉండవు...

Weekly Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపకాలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు సామాన్యం. ఉల్లాసంగా గడుపుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితులు సాయం అందిస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. పనులు సానుకూలమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు సామాన్యం. వాతావరణం అనుకూలించదు. పనులు వాయిదా వేసుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రముఖులకు చేరువవుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వేడుకకు హాజరవుతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంభాషిస్తారు. ప్రయాణం కలిసివస్తుంది.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లౌక్యంగా బాకీలు రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించి భంగపడతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో మెలగండి. అతిగా ఆలోచింపవద్దు. మొక్కుబడిగా పనులు పూర్తిచేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయలపై శ్రద్ధ వహిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయం బాగుంటుంది. రుణసమస్యలు తొలగుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
చాకచక్యంగా వ్యవహరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. మీ జోక్యం అనివార్యం. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆలయాలు సందర్శిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పొదుపు ధనం అందుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కీలక చర్చల్లో పాల్గొంటారు. ప్రలోభాలకు గురికావద్దు. ఆత్మీయుల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అవకాశాలు కలిసివస్తాయి. మానసికంగా కుదుటపడతారు.. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఖర్చులు విపరీతం. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు.