సోమవారం, 13 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-09-2024 శుక్రవారం రాశిఫలాలు - మీ కష్టం ఫలిస్తుంది.. ఉల్లాసంగా గడుపుతారు...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సమర్ధతను చాటుకుంటారు. కొత్త పరిచయాలు మీ విజయానికి తోడ్పడతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దైవకార్యంపై దృష్టి పెడతారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రియతములతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. సన్నిహితులు సాయం అందిస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మీ కష్టం ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఖర్చుల గురించి ఆలోచిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ప్రయాణం విరమించుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యం సిద్ధిస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. పత్రాలు అందుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. పదవులు, బాధ్యతల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులతో జాగ్రత్త. విలాసాలక వ్యయం చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనుల సానుకూలతకు ఓర్పు ప్రధానం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. పనులు ఒక పట్టాన సాగవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. సోదరులతో సంద్రింపులు జరుపుతారు. వివాదాలు కొలిక్కివవస్తాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. లౌక్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. రేపటి గురించి ఆలోచిస్తారు. పనులు వేగవంతమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మొండిధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కష్టం వృధా కాదు. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత వహించండి. అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పనులు ఒక పట్టాన సాగవు. మీ సామర్ధ్యంపై నమ్మకం సడలుతుంది. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. అనవసరజోక్యం తగదు. సంతానానికి శుభం జరుగుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్ధికంగా బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. మనోధైర్యంతో మెలగండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సన్నిహితులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.