గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-07-2022 శుక్రవారం రాశిఫలాలు ... సరస్వతి దేవిని ఆరాధించిన శుభం..

మేషం :- కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేయవలసి ఉంటుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా కొనసాగుతాయి. మీ సమస్యలు, చికాకులు తాత్కాలికమేనని గమనించండి. మీరు అమితంగా అభిమానించే వారిని కలుసుకుంటారు. స్త్రీలు వస్త్రాలు, ఆభరణాల పట్ల ఆకర్షితులవుతారు.
 
వృషభం :- ఆలయాలను సందర్శిస్తారు. బంధువుల రాక వల్ల స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వారికి చికాకులు తప్పవు. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
మిథునం :- స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏకాంతంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపతారు.
 
కర్కాటకం :- కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. వ్యాపార, ఉపాధి పథకాల్లో చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కానవస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
 
సింహం :- కళా రంగాలలోని వారికి అనుకూలమైన కాలం. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. క్రయ విక్రయదార్లకు అనుకూలంగా ఉండును.
 
కన్య :- ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కానవస్తుంది. స్త్రీలకు కొత్త కొత్త కోరికలు, సరదాలు స్ఫురిస్తాయి. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ఆనందకరమైన హృదయంతో ఎలాంటి పనిలోనైనా విజయాన్ని సాధించవచ్చన్న వాస్తవాన్ని గుర్తిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
 
తుల :- ఉద్యోగస్తులకు ఏకాగ్రత, క్రమశిక్షణ ముఖ్యం. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందుకెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. శత్రువుల సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు.
 
వృశ్చికం :- ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది, మెళకువ వహించండి. విదేశీయాన యత్నాలు కొంతవరకు అనుకూలించగలవు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.
 
ధనస్సు :- ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేక పోతారు. మీకున్న దానితో సంతృప్తి చెందండి. మీ సంతానం పై చదువుల కోసం బాగా శ్రమిస్తారు. సాహిత్య సదస్సులలోను, బృందకార్య క్రమాలో చురుకుగా పాల్గొంటారు. మీ అనుభవాలను ముఖ్యులతో పంచుకుంటారు. వడ్డీలు, డిపాజిట్లు చేతికందుతాయి.
 
మకరం :- ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. సాంఘిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వల్ల అప్రమత్తత అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఎలక్ట్రానికల్, వైజ్ఞానిక, శాస్త్ర, కంప్యూటర్, టెక్నికల్ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవచ్చును.
 
కుంభం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో ఇబ్బందు లెదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా వుంచండి. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ సహాయం అర్థిస్తారు. బదిలీలు, మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రణాళికలు రూపొందుంచుకుంటారు. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారాస్తులకు శుభదాయకం.
 
మీనం :- సమయానికి కావలసిన ధనం సర్దుబాటుకాక ఇబ్బందు లెదుర్కుంటారు. విద్యార్థుల్లో మానసిక ప్రశంతత నెలకొంటుంది. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. ట్రాన్సుపోర్టు, అటోమోబైల్ రంగాలలో వారికి మంచి మంచి అవకాశాలు లభించి పనిభారం అధికమవుతుంది.