శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

10-07-2022 - ఆదివారం మీ రాశి ఫలితాలు

Surya Deva
ఆదిత్యుని ఎర్రని పూలతో పూజించిన సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం:- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. సాంఘిక, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ప్రేమికులకు పెద్దల నుంచి ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. తలపెట్టిన పనులు చురుకుగా సాగుతాయి.
 
వృషభం :- శత్రువులపై విజయం సాధిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింత శ్రమించవలసి ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినా గానీ నెమ్మదిగా సమసిపోతాయి. ఇతరుల ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోకండి.
 
మిధునం:- హోటల్, తినుబండా వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు మందకొడిగా సాగుతాయి. కుటింబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. తలపెట్టిన పనులు త్వరతగతిన పూర్తి చేస్తారు. ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ వహించండి.
 
కర్కాటకం:- వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి కానవస్తుంది. రుణ ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కుంటారు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. గృహ మరమ్మతులు వాయిదా పడతాయి. పరిచయాలు మరింతగా బలపడతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాల్లో లౌక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది.
 
సింహం:- ఆర్ధిక వ్యవహారాలు గోప్యంగా ఉంచటం క్షేమదాయకం. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయడం మంచిదికాదు. సోదరీ, సోదరుల కలయిక పరస్పర అవగాహన కుదురును. రాజకీయాలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసి పోతాయి. పెద్దలను ప్రముఖులను కలుస్తారు.
 
కన్య: - ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. .
 
తుల:- మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. అనుబంధాలలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వైవాహిక జీవితంలో అనుకోనిచికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం:- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి ముఖ్యుల సహకారం వలన సమసిపోతాయి. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
ధనస్సు: - సొంతంగా గాని, భాగస్వామ్యంగా గాని మీరు ఆశించిన విధంగా రాణించలేరు. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులు ప్రతి విషయంలోను మితంగా వ్యవహరించటం క్షేమదాయకం. లాయర్లు చికాకులు తప్పవు.
 
మకరం:- ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకున్నంత సంతృప్తిని ఇవ్వవు. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంలో కొంత నిరుత్సాహానికి గురవుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
కుంభం:- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. కొంత మంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు.
 
మీనం:- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలను తెచ్చుకొకండి. అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురైనా మొండి ధైర్యంతో ముందుకు సాగండి.