ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-11-2022 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధిస్తే శుభం

anjaneya swamy
మేషం :- ఆకస్మిక ఖర్చులు, పెరిగిన కుటుంబ అవసరాలు అందోళన కలిగిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతను పై అధికారులు గుర్తిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ యాత్నాలకు ప్రముఖుల తోడ్పాటు లభిస్తుంది. అనుకున్న పనులు సజావుగా పూర్తిచేస్తారు. నూతన వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
వృషభం :- ఉద్యోగస్తుల శ్రమకు మంచి గుర్తింపు, రాణింపు ప్రోత్సాహం వంటివి లభిస్తాయి. గృహంలో ఏదైన వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది, మెళకువ వహించండి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు పలు సమస్యలకు దారితీయవచ్చు.
 
మిథునం :- రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. క్రయ విక్రయాలు లాభదాయకంగా సాగుతాయి. స్త్రీలు అనవసర విషయాలకు, భేషజాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం :- స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఏకీభావం ఉండదు. ఉపాధ్యాయులు కొత్త కొత్త పథకాలు అమలు చేస్తారు.
 
సింహం :- మీ సంతానం ధోరణి చికాకు పరుస్తుంది. బంధువుల రాక మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. వాహనం కొనుగోలు యత్నం ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించటం మంచిది. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
కన్య :- నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. రావలసిన ఆదాయం అందటంతో ఆర్థికంగా ఒకడుగు ముందుకేస్తారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, స్థిరచరాస్తుల అభివృద్ధికై చేయుకృషిలో సఫలీకృతులౌతారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
తుల :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారాలకు లాభదాయకం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. సమయానికి సహకరించని మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి.
 
వృశ్చికం :- నిర్మాణ పనులు, గృహమరమ్మతులు చురుకుగా సాగుతాయి. ఎప్పటి నుంచో వేధిస్తున్న ఒక సమస్య మీకు  అనుకూలంగా పరిష్కారమవుతుంది. పాత మిత్రుల కలయిక మీలో నూతనోత్సాహం కలిగిస్తుంది. ప్రేమికులకు సన్నిహితులు అండగా నిలుస్తారు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిదని గమనించండి.
 
ధనస్సు :- సోదరులు మీ ఔన్నత్యాన్ని అర్ధం చేసుకుంటారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. మీ మాటకు కుటుంబంలోను, సంఘంలోను గౌరవం ఏర్పడుతుంది.
 
మకరం :- వాహనం నడుపుతున్నపుడు విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. స్త్రీలకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఉద్యోగసులు సమర్థంగా పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన చికాకులు తొలగిపోగలవు. 
 
కుంభం :- ఉమ్మడి వ్యవహారాల్లో చికాకులు, భాగస్తులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. రుణయత్నాలు, విదేశీయానం అనూకూలిస్తాయి. విద్యార్థులకు నూతన పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు మీస్టోమతకు తగినట్లుగానే ఉంటాయి.
 
మీనం :- దైవ సేవా కార్యాక్రమాలలో పాల్గొంటారు. ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించంటం మంచిదని గమనించండి. ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు, ఆర్థిక లబ్ది వంటి శుభపరిణామా లుంటాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. గృహ మరమ్మతులు, నిర్మాణాలు చేపడతారు.