1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-03-2023 - శుక్రవారం రాశిఫలాలు - పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు..

Leo
మేషం :- వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. మీ సమర్థతకు తగిన గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులకు విలువైన కానుకలందించి వారిని ఆకట్టుకుంటారు. స్త్రీలకు టీ.వీ., కార్యక్రమాల్లో అవకాశం లభిస్తుంది.
 
వృషభం :- ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయటం మంచిది. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉందిప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. గత కొంతకాలంగా ఆగిన పనులు పునఃప్రారంభించారు.
 
మిథునం :- స్త్రీలకు కాళ్ళు, నడము, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. తరచు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య అభిప్రాయభేధాలు తలెత్తుతాయి. అనుకోకుండా ఏర్పడిన ఒక స్నేహబంధం భవిష్యత్తులో మీకు మంచే చేస్తుంది. కోర్టు వ్యవహరాలు వాయిదా పడే సూచనలున్నాయి. 
 
కర్కాటకం:- గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులుతప్పవు.
 
సింహం :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాత మిత్రులు, ప్రముఖులతో చర్చలు జరుపుతారు. విద్యార్థుల తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు తప్పవు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించు కోగలుగుతారు.
 
కన్య :- ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి చేకూరుతుంది. మీ శ్రీమతి సలహా పాటించటం శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. 
 
తుల :- ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఒప్పందాలు, హామీల విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కుటుంబంలో ఒకరి ధోరణి మీకు ఎంతో ఆందోళన, చికాకు కలిగిస్తుంది. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్న ఏకాగ్రత వహించలేరు. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
ధనస్సు :- వృత్తి వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. భాగస్వామిక వ్యాపారాలు, సంస్థల స్థాపన ప్రస్తుతానికి వాయిదా వేయండి. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత ప్రధానం. దూర ప్రాంతలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచనమంచిది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రతిపని చేతిదాకా వచ్చి వెనక్కి పోవడం వల్ల నిరుత్సాహం, ఆవేదనకు లోనవుతారు.
 
కుంభం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. స్త్రీలపై పొరుగువారి వ్యాఖ్యల ప్రభావం అధికం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలపట్ల ఏకాగ్రత వహించవలసి ఉంటుంది.
 
మీనం :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ఇతర ఒప్పందాలు వాయిదా పడటం మంచిది. శ్రీమతిసలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయం కాగలవు.