బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-08-2023 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని పూజించినా ఆర్ధికాభివృద్ధి...

Taurus
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు॥ సప్తమి ఉ.9.07 జ్యేష్ట ప.12.27 రా.వ.8.12 ల 9.45. ఉ.దు.8.17 ల 9.07 ప. దు. 12. 25 ల 1.15.
 
లక్ష్మీనృసింహస్వామిని పూజించినా ఆర్ధికాభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు.
 
మేషం :- స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం పెంచుకుంటారు. కాలంతో పోటీపడి పనిచేస్తారు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృషభం :- స్త్రీల అభిప్రాయాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ఖచ్చితంగా మెలగండి. కొత్త పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి. ఉద్యోగులు కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. స్వార్ధపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువవ్వాలని భావిస్తున్న వారిని దూరంగాఉంచండి.
 
మిథునం :- ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు క్షేమదాయకం కాదు. సహకార సంఘాల్లో వారికి, ప్రైవేటు సంస్థల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సోదరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. 
 
కర్కాటకం :- పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు పురోభివృద్ధి. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఉత్సాహం అధికం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి శ్రమ, పనిభారం అధికమవుతాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. స్త్రీలతో సంభాషించేటప్పుడు మితంగా వ్యవహరించండి.
 
సింహం :- సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. మీ కుంటుంబ విషయంలో ఇతరులు జోక్యం మీకు ఎంతో ఆందోళన, చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. సాంకేతిక, వైద్య రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. పొదుపుపై దృష్టి కేంద్రీకరిస్తారు.
 
కన్య :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ వహించండి. మీ భావాలు, అభిప్రాయాలకు ఎదుటివారు విలువిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకున్నదొకటి, జరిగేది మరొకటి అయ్యే అవకాశాలున్నాయి. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. 
 
తుల :- రాజకీయ పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. బ్యాంకింగ్ వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
వృశ్చికం :- దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. అందరికి సహాయం చేసి సమస్యలు ఎదుర్కొంటారు. బరన్, ఆటోమోబైల్, ట్రాన్సుపోర్టు, మెకానికల్ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
ధనస్సు :- వాస్తవానికి మీరు నిదానస్తులైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. ఉన్నత విద్యల కోసం చేసే యత్నం ఫలిస్తుంది. విద్యార్థులకు నూతన వాతావరణం, పరిచయాలు సంతృప్తినిస్తాయి. రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.
 
మకరం :- ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. స్త్రీలునరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ధన వ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెళకువ వహించండి. ద్విచక్ర వాహనం పై దూర ప్రయాణాలు మంచికాదు. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదు.
 
కుంభం :- రావలసిన ధనం అందటం వల్ల తాకట్టు వస్తువులను విడిపిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తుతాయి. ఇంటా, బయటా ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కంప్యూటర్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తు పట్ల ఏకాగ్రత అవసరం.
 
మీనం :- భాగస్వామిక చర్చల్లో మీ సూచనలకు మంచి స్పందన లభిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనలు, దూర ప్రయాణాలకు అనుకూలం. సంఘంలో గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం. కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశ వదిలేసుకున్న ఒక అవకాశం మీకే అనుకూలిస్తుంది.