1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-07-2025 శనివారం దినఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం...

daily horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికస్థితి నిరాశాజనకం. రోజులు భారంగా గడుస్తున్నట్టనిపిస్తాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోండి. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. శ్రమ ఫలించకున్నా నిరుత్సాహపడవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. చెల్లింపుల్లో మెళకువ వహించండి. పనులు అర్థాంతంగా ముగిస్తారు. పత్రాలు సమయానికి కనిపించవు దైవకార్యంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అప్రయత్నంగా అవకాశం కలిసివస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం సాయం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాదాలు కొలిక్కి వస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాక్పటిమతో నెట్టుకొస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గుట్టుగా వ్యవహరించండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పనులు వేగవంతమవుతాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. సమర్ధతను చాటుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులు చేరువవుతారు. పనులు సానుకూలమవుతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మాట నిలబెట్టుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అధికం. వాగ్వాదాలకు దిగవద్దు. పిల్లల దూకుడు అదుపు చేయండి. సామాజిక, దైవకార్య సమావేశంలో పాల్గొంటారు, 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞులను సంప్రదించండి. పట్టుదలకు పోవద్దు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకూలతలు అంతంత మాత్రమే. మీ సాయం పొందిన వారే తప్పుపడతారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో మెలగండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలమే. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక పత్రాలు అందుతాయి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయం తీసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. సన్నిహితులను సంప్రదించండి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త. ఆశించిన పదువుల దక్కకపోవచ్చు. ఏది జరిగినా మంచికేనని భావించండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. నిస్తేజానికి లోనవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు వస్తువులు లభ్యమవుతాయి.