బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-11-2023 ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం చదివినా లేక..?

Adithya hrudayam
ఆదిత్య హృదయం చదివినా లేక విన్నా మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం:- మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ఆత్మీయుల నడుమ కానుక లిచ్చిపుచ్చుకుంటారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి కాగలవు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
వృషభం :- ఆర్ధిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. ఉమ్మడి, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మత్స్యకోళ్ళ వ్యాపారస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రయాణాలలో వస్తువులుపోయే ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి.
 
మిధునం:- వన సమారాధనలు, వేడుకలలో అందిరితో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు ఇరుగు పొరుగువారితో సఖ్యత అంతగా ఉండదు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు.
 
కర్కాటకం:– ఆర్ధికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. అనవసర ఖర్చులు పెరగటంతో ఒకింత ఆందోళన చెందుతారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మీ సంతానం ప్రేమ వ్యవహారం, వివాహం పెద్ద చర్చనీయాంశమవుతుంది.
 
సింహం:- ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. ఎదుటివారితోముక్తసరిగా సంభాషిస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆహార వ్యవహరాల్లో ఏకాగ్రత, మెళుకువ అవసరం.
 
కన్య:- విందులలో పరిమితి పాటించండి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురయ్యే సూచనలున్నాయి. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిలోను ఏకాగ్రత వహించలేరు.
 
తుల:- ఉద్యోగులు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీల పట్టుదలవల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యక్రమాలు మీ చేతుల మీదుగానే సాగుతాయి. మీ అభిరుచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహంలో చిన్న చిన్న సమస్యలు, చికాకులు తలెత్తుతాయి.
 
వృశ్చికం:- ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపంవంటి చికాకులు తప్పవు. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువు, మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. స్త్రీల ఆరోగ్యం అంత సంతృప్తికరంగా ఉండదు.
 
ధనస్సు:- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ఊహగానాలతో కాలం వ్యర్ధంచేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు వంటివి ఎదుర్కొంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. శకునాల కారణంగా మీ ప్రయాణం వాయిదా వేసుకుంటారు.
 
మకరం:- రాజకీయాల్లో వారికి ఆదరాభి మానాలు అధికం అవుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకై చేయు యత్నాలలో సఫలీకృతులౌతారు. నిరుద్యోగులలో నిరుత్సాహం, నిర్లిప్తత అధికమవుతాయి. బంధువుల రాకవల్ల గృహంలో సందడి కానవస్తుంది.
 
కుంభం:- ద్విచక్ర వాహనం పై దూరప్రయాణాలు మంచిదికాదని గమనించండి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు కృషి ఫలిస్తుంది. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ వహించండి.
 
మీనం:- సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వనసమారాధనలో బంధుమిత్రులతో కలియిక సంతోషాన్ని కలిగిస్తుంది. మీ కళత్ర మొండితనం చికాకు కలిగిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారుకు లాభదాయకంగా ఉంటుంది.