మంగళవారం, 21 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-11-2023 మంగళవారం దినఫలాలు - గాయిత్రి మాతను ఆరాధించిన శుభం...

శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక శు॥ నవమి రా. 12.53 శతభిషం రా.8.36 ఉ.వ.6.26 కు రా.వ. 2.33 ల 4. 03. ఉ.దు. 8. 19 ల 9.05రా.దు. 10. 28 ల 11.18.
 
గాయిత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
 
మేషం :- మీ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. సందర్భానుసారంగా మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకుంటారు. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
వృషభం :- మీ విషయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్త పడండి. దైవ, వన సమారాధానలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహరాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.
 
మిథునం :- మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు అనవసర విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ప్రకటనలు, జాబ్ ఏజెన్సీల పట్ల అప్రమత్తత అవసరం. రుణ విముక్తులు కావటంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం :- మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. కొంతమంది మీ నుంచి విషయ సేకరణకు యత్నిస్తారు. మిత్రుల సూచనలు మీపై ప్రభావం చూపుతాయి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.
 
సింహం :- బంధువుల తాకిడి అధికంగా ఉంటుంది. ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. పత్రికా సంస్థలోని ఉద్యోగస్తులకు యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. మీ సంతానం అత్యుత్సాహం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారముంది. 
 
కన్య :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారాలు పుంజుకుంటాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
తుల :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో సఫలీకృతులవుతారు. లౌక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు. ఆస్తి పంపకాల్లో పెద్దల నిర్ణయం నిరుత్సాహపరుస్తుంది.
 
వృశ్చికం :- ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లకు ఏకాగ్రత ముఖ్యం. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ధ్యేయం కార్యరూపం దాల్చుతుంది. తీర్థయాత్రలు, కొత్త ప్రదేశ సందర్శనలు కొత్త అనుభూతినిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి.
 
ధనస్సు :- తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ప్రియతముల కలయిక సంతోషపరుస్తుంది. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
మకరం :- ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆహార, వ్యవహారాలు, ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. నూతన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. తలపెట్టిన పనులు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు వాయిదాపడతాయి.
 
కుంభం :- భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా సాగుతాయి. క్యాటరింగ్ పని వారలకు శుభదాయకం. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల అదనపు పనిభారం తప్పదు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల విషయంలో జాప్యం తప్పదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
 
మీనం :- వృత్తి ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం తప్పదు. స్త్రీలకు పట్టింపులు అధికంగా ఉంటాయి.