శుక్రవారం, 21 జూన్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-11-2023 శనివారం రాశిఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో పూజించిన...

horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక శు॥ పంచమి ఉ.9.48 ఉత్తరాషాఢ రా.1.17 ఉ.వ.10.06 ల 11.37
తె.వ.5.02 ల ఉ.దు. 6.03 ల 7.34.
శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో పూజించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. పారిశ్రామిక రంగాలవారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులక కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
వృషభం :- చిన్నతరహా పరిశ్రమల వారికి సత్కాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. లౌక్యంగా వ్యవహరించటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరగటంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు తప్పవు. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
మిథునం :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. సొంత వ్యాపారాలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం :- శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలుపొందలేరు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాల నివ్వగలవు. ధన వ్యయం, రుణ సహాయానికి సంబంధించిన విషయాల్లో కుటుంబీకులను సంప్రదించటం మంచిది. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
సింహం :- ఆర్థికలావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగ యత్నాలు ఒకకొలిక్కివస్తాయి. స్త్రీలు దైవ, శుభకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తుల సమర్థత, ప్రతిభకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెరగటంతో అదనపు ఆదాయ సంపాదన దిశగా మీ ఆలోచనలుంటాయి.
 
కన్య :- బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్త్రీల అనాలోచిత నిర్ణయాలు, ఆగ్రహావేశాల వల్ల కుటుంబంలో కలహాలు తప్పవు. విద్యార్థులకు దూరప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
 
తుల :- దంపతుల మధ్య అకారణ కలహం, పట్టింపులు అధికమవుతాయి. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. విదేశీయానం కోసంచేసే యత్నాలు అనుకూలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
వృశ్చికం :- ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఆపత్సమయంలో బంధుమిత్రులు అండగా నిలుస్తారు. మీ సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. దాన ధర్మాలు చేయడం మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు, షాపింగ్ వ్యవహరాల్లో ఏకాగ్రత అవసరం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
మకరం :- ఉద్యోగస్తులకు సమస్య లెదురైనా ఆదాయానికి లోటుండదనే చెప్పవచ్చు. బంధు మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. కోర్టు వ్యవహరాల్లో ఫ్లీడర్ల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. మీ మాటకు కుటుంబంలోనూ, సంఘంలోను వ్యతిరేకత ఎదురవుతుంది. క్రయవిక్రయాలు మందకొడిగా ఉంటాయి.
 
కుంభం :- పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో మెళకువ అవసరం. ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు వాహన సౌఖ్యం, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి.
 
మీనం :- బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వృత్తి వ్యాపారులకు శ్రమకుతగిన ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరగటం వల్ల పనిభారం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.