బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-11-2023 బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం...

Weekly astrology
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక శు॥ విదియ ప.1.49 జ్యేష్ట తె.4.00 ఉ.వ.9.43 ల 11.18. ప. దు. 11.21 ల 12.07.
సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- విదేశీ వస్తువులను సేకరిస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్, కొరియర్ రంగాలలో వారికి విశ్రాంతి లభిస్తుంది. శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. విద్యార్థులకు స్త్రీ మూలక సమస్యలు తలెత్తుతాయి. ప్రత్యర్థులు సైతం మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. నిరుద్యోగులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగించగలదు.
 
వృషభం :- ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో మార్పు కానవస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో హామీలుండటం మంచిది కాదని గమనించండి. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పెరిగే ఖర్చులు, అవసరాలు మీ రాబడికి మించటంతో ఆందోళన, నిరుత్సాహం అధికమవుతాయి.
 
మిథునం :- ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. సోదరీ, సోదరుల కలయిక పరస్పర అవగాహన కుదురును. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. నిరుద్యోగులకు సదవకాశాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యమునందు జాగ్రత్త అవసరం.
 
కర్కాటకం :- దైవ, పుణ్య, సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి పెంచుకుంటారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఒత్తిడి, ఆందోళన అధికం కాగలవు. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని అనుకున్న పనులుపూర్తికావు. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలందుపై అధికారులు ఒత్తిడిని ఎదుర్కుంటారు.
 
సింహం :- వాణిజ్య రంగాల వారికి అనుకూలమైన కాలం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ అభిప్రాయాలకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భాగస్వామ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు రాగలవు. రుణ యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కుంటారు.
 
కన్య :- సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. ప్రముఖుల కలయిక మీకెంతో ఉపకరిస్తుంది. విద్యార్థులకు నూతన వాతావరణం, పరిచయాలు సంతృప్తినిస్తాయి. పూర్వపు మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. స్త్రీలకు అలసట, అధికశ్రమ తప్పదు.
 
తుల :- ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. గణిత, సైన్సు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ వృత్తుల్లో వారికి కలిసి వచ్చేకాలం. చిన్నారులతో బంధం ఏర్పడుతుంది. స్త్రీల అజాగ్రత్త వల్ల విలువైన వస్తువు చేజారిపోయే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేరు.
 
వృశ్చికం :- నిరుద్యోగులకు అవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేరు. పెద్దలతో ఆస్తి వ్యవహారాలు సంప్రదింపులు జరుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇచ్చుపుచ్చుకునే విషయాల్లో ఖచ్చితంగా వ్యవహరించండి. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది.
 
ధనస్సు :- ఒకానొక సందర్భంలో మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వస్త్ర, బంగారు, వెండి, వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులు ఏకాగ్రతతో పనిచేసి అధికారులను మెప్పిస్తారు.
 
మకరం :- బంధువులు కొంతమంది మీ మీద నిందారోపణ చేయడం వల్ల ఆందోళన అధికమవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం రాకపోవచ్చు. భాగస్వామిక వ్యాపారస్తులకు పరస్పర అవగాహన కుదరకపోవచ్చు. కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు.
 
కుంభం :- ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. తలపెట్టిన పనులలో జాప్యం వల్ల నిరుత్సాహం తప్పదు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. స్త్రీలకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉపాధ్యాయుల శ్రమ, పనితనాన్ని అధికారులు గుర్తిస్తారు.
 
మీనం :- ఆర్థికస్థితి ఒకింత మెరుగుపడటంతో ఊరట చెందుతారు. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి మెళకువ అవసరం. సోదరుల మధ్య సయోధ్య నెలకొంటుంది. రావలసిన ధనం చేతికందడంతో పొదుపు పథకాల వైపు దృష్టి మళ్లిస్తారు. దూరంలో ఉన్న వ్యక్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.