గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-07-2022 శనివారం దినఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో...

Karkatam
మేషం :- కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. ప్రేమ వ్యవహరాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు అన్ని విదాల కలిసిరాగలదు. చేపట్టిన పనులు ఏమాత్రం ముందుకు సాగవు.
 
వృషభం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో గుర్తింపు, ఆహ్వానాలు అందుతాయి.
 
మిథునం :- ఉమ్మడి వ్యవహారాలు, భాగస్వామిక చర్చల్లో ఏకాగ్రత అవసరం. ప్రైవేటు విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. ఉపాధ్యాయులకు సంతృప్తి కానవస్తుంది. ఇతరులకు అతిచనువు ఇవ్వటం మంచిది కాదని గమనించడి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది.
 
కర్కాటకం :- శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమ తప్పవు. అప్రయత్న కార్యసిద్ధి, ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడగలవు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
సింహం :- ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో త్వరలోనే లభిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలు షాపింగులో ఏకాగ్రత వహిస్తారు. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఏ యత్నం ఫలించకపోవటంతో నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు.
 
కన్య :- ఒప్పందాలు, చెక్కుల జారీల విషయంలో ఏకాగ్రత వహించండి. కళా, క్రీడా రంగాలలోని వారికి కలిసిరాగలదు. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఖాతాదారులతో చికాకులు తప్పవు. సోదరి సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి.
 
తుల :- స్త్రీలకు ఆర్తనపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల సలహా విన్నప్పటికీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. విద్యుత్ రంగాల్లో వారు మాటపడవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఉద్యోగస్తుల పనితీరు, క్రమశిక్షణ అధికారులను ఆకట్టుకుంటాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
వృశ్చికం :- ఉద్యోగ రీత్యా తరచు దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు ప్రారంభించిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయాలలో వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా కలిసివస్తుంది. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
ధనస్సు :- రాజకీయాలలోని వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు అదుపు చేయటం కష్టం. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది.
 
మకరం :- మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. వాతావరణంలోని మార్పులు వల్ల మీ పనులు వాయిదా పడతాయి.
 
కుంభం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటి పైనే శ్రద్ద వహించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బ్యాంకు లావాదేవీలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం.
 
మీనం :- దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అనుకున్నది సాధించాలి అనే పట్టుదల పెరుగుతుంది. ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా పుంజుకుంటారు. ఒంటరిగా ఏపని చేయటం క్షేమం కాదని గమనించండి. రాజకీయ నాయకులకు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు.