ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-03-2022 బుధవారం రాశిఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన...

మేషం :- ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతిపథంలో కొనసాగుతాయి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో రాణిస్తారు. పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.
 
వృషభం :- బ్యాంక్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధువులరాకతో అనుకోని కొన్ని ఖర్చులు మీద పడతాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. బంధువులు మీ నుంచి ధనసహాయం కోరవచ్చు. కుటుంబంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
మిథునం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. రాజకీయనాయకులు విరోధులు వేసేపథకాలు తెలివితో త్రిప్పి గొట్టగలుగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేక ప్రత్యేక ఇంక్రిమెంటు వంటి శుభపరిణామాలుంటాయి. కొంతమంది మీ గురించి చాటుగా విమర్శలు చేసే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం :- వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులు తప్పవు. అంతగా పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఖర్చులు పెరగటంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది.
 
సింహం :- వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు అన్ని విధాలా కలిసిరాగలదు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయగల్గుతారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడంవల్ల ఆందోళనకు గురవుతారు.
 
కన్య :- మీ అతిథి మర్యాదలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. విద్యార్థులు ఉన్నత చదువుల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు రాబడికి తగినట్లే ఉండటంతో ఇబ్బందులంతగా ఉండవు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు.
 
తుల :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు బదిలీ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. 
 
వృశ్చికం :- ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. నిరుద్యోగులు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు.
 
ధనస్సు :- వ్యవహారాల్లో జయం, సమర్థతకు గుర్తింపు పొందుతారు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి లోనవుతారు. రుణ విముక్తులు కావటంతోపాటు కొత్త రుణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. ప్రముఖుల సహకారంతో కొన్ని సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
 
మకరం :- ట్రాన్స్‌పోపోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి పనివారితో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి స్థిరచిత్తంతో పనిచేయవలసి ఉంటుంది. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది. అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగించడం వల్ల ఆందోళన చెందుతారు.
 
కుంభం :- స్త్రీలకు బంధుమిత్రుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. కోర్టు వ్యవహరాలు పరిష్కారమవుతాయి. ఉపాధ్యాయులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రం నిల్వచేయలేకపోవడటం వల్ల ఆందోళనకు గురవుతారు. 
 
మీనం :- మీ సంతానం ఉన్నత విద్యల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత చాలా అవసరం. అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులు ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది.