బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 29 డిశెంబరు 2024 (21:17 IST)

డిసెంబరు 29 నుంచి జనవరి 04 వరకు మీ వార ఫలితాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిసాస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పరిచయాలు బలపడతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. బుధవారం నాడు నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ కనబరుస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమతో కూడిన విజయాలున్నాయి. పట్టుదలతో ముందుకు సాగండి. పరిస్థితులు త్వరలో మెరుగుపడతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. తరుచు సన్నిహితులతో సంభాషిస్తుంటారు. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం దూకుడు అదుపు చేయండి. శుక్రవారం నాడు కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి విముక్తులవుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మీ శ్రీమతి సలహా ఉపకరిస్తుంది. వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. తలపెట్టిన కార్యక్రమం వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. అధికారుల మన్ననలు అందుకుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు మరింత శ్రమించాలి. భేషజాలు, పట్టింపులకు పోవద్దు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. మీ ఆలోచనలు గోప్యంగా ఉంచండి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. యాదృచ్ఛికంగా పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు. కళా, క్రీడా పోటీల్లో పాల్గొంటారు.
 
సింహం :  మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో మెలగండి. కృషి ఫలించకున్నా శ్రమించామన్న తృప్తి ఉంటుంది. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. గృహోపకరణాలు, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకోగల్గుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్థతను చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు. బుధ, గురువారాల్లో అందరితోనూ మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు చేరవేసే వారున్నారని గమనించండి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో శుభపరిణామాలున్నాయి. స్థల వివాదాలు కొలిక్కివస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లకండి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. శనివారం నాడు చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుక తలపెడతారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. అధికారులకు హోదామార్పు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. పందాలు, క్రీడాపోటీల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికలావాదేవీలు విజయవంతంగా ముగుస్తాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ముఖ్యమైన విషయాల్లో ఒత్తిడికి గురికావద్దు. పెద్దల సలహా పాటించండి. గృహమరమ్మతులు చేపడతారు. వస్త్రవ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వాహనదారులకు అత్యుత్సాహం తగదు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం గ్రహసంచారం అనుకూలంగా ఉంది. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆత్మీయులతో కాలక్షేపపం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుక తలపెడతారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ ఓర్పు, పట్టుదల విజయానికి దోహదపడతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆపన్నులకు సాయం అందిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడపుతారు. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు స్థానచలనంతో కూడిన పదోన్నతి. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. అన్ని విధాలా శుభమే జరుగుతుంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆప్తుల సాయం అందిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా సంతానానికి శుభపరిణామాలున్నాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగపరంగా మరింత శ్రద్ధ అవసరం. ఆందోళనకు గురికావుద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధి పథకం చేపడతారు. ప్రయాణంలో జాగ్రత్త. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనసమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఆది, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. దంపతుల మధ్య అకారణ కలహం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వేడుకలో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.