Author %e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d 0.html

Notifications

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1,127 కోట్ల పెట్టుబడి కోసం హిందుస్థాన్ కోకా-కోలాకు అనుమతులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1,127 కోట్ల పెట్టుబడి కోసం హిందుస్థాన్ కోకా-కోలాకు అనుమతులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వంవిశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరో పెట్టుబడి ప్రతిపాదన ముందుకొచ్చింది. ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థ హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(హెచ్‌సీసీబీ) రాష్ట్రంలో రూ.1,127 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వ అనుమతులు అందుకుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఈ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించిన ఉత్తర్వులను(జీఓ) హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్(HCCB)లో ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ విభాగం అధిపతి అయిన అవినాష్ కాంత్ కుమార్‌కు విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో భాగంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, పరిశ్రమల రంగ ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందజేశారు.

రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు.. రూ.10 లక్షల కోట్ల భూములే టార్గెట్

రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు.. రూ.10 లక్షల కోట్ల భూములే టార్గెట్కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం ద్వారా మరోసారి పార్టీకి ఇబ్బందులు సృష్టించారు. హైదరాబాద్ ప్రాంతంలో సుమారు రూ.10 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. వివాదాల్లో ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తుల సహాయంతో క్లియర్ చేయిస్తున్నారని, దీనివల్ల రేవంత్ రెడ్డికి, ఆయన సోదరులకు లబ్ధి చేకూరుతోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి భూ లావాదేవీలు, తెరవెనుక జరుగుతున్న వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్లాయి.

కార్తీక మాసం తొమ్మిదో రోజున తులసీ పూజ.. సిరిసంపదల కోసం...?

కార్తీక మాసం తొమ్మిదో రోజున తులసీ పూజ.. సిరిసంపదల కోసం...?కార్తీక మాసం తొమ్మిదో రోజున (నవంబర్ 18-11-2026) తులసీ పూజ చేయడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. ఈ నెలలో శివ, విష్ణు పూజలు దీపారాధన ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసం తొమ్మిదో రోజైన బుధవారం ఉదయం బ్రహ్మ ముహూర్త వేళ, లేకుంటే సాయంత్రం పూట తులసీ కోట ముందు దీపం వెలిగించాలి. అంతకుముందు తులసీ కోట ముందు శుభ్రం చేసి.. ముగ్గులు, పువ్వులతో అలంకరించుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత ధూపం వేసి కర్పూర హారతి, నైవేద్యం సమర్పించాలి. తులసీ మాతకు పండ్లు లేదా బెల్లం నైవేద్యంగా సమర్పించడం కార్యసిద్ధిని, అనుకున్న కోరికలను నెరవేరుస్తుంది. ఆపై తులసి అష్టోత్తరం, తులసీ స్తోత్రం చదువుకోవాలి. తులసీ మొక్క చుట్టూ 3,5, 11 ప్రదక్షిణలు చేయడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.