Daily Horoscope
✕

రక్తపోటును అదుపులో వుంచే అశ్వగంధ

Written By సిహెచ్
Updated: మంగళవారం, 4 మే 2021 (21:59 IST)
అశ్వగంధ. దీనికి వుండే ఔషధ లక్షణాల వల్ల ఒత్తిడి, ఆందోళన మరియు మధుమేహం అడ్డుకునేందుకు సహాయపడుతుంది. అశ్వగంధ వేర్ల నుంచి తీసిన పౌడర్, పాలతో తీసుకున్నప్పుడు వంధ్యత్వం సమస్య తగ్గుతుంది. అశ్వగంధతో ఒక ముఖ్యమైన ముందు జాగ్రత్త ఏమిటంటే ఇది గర్భధారణ సమయంలో తీసుకోకూడదు. ఎందుకంటే ఇది గర్భాశయ సమస్యలను పెంచుతుంది.
 
అశ్వగంధ అధిక రక్తపోటు వంటి ఒత్తిడి, ఒత్తిడి సంబంధిత సమస్యలను పరిష్కరించి వ్యక్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 
ఒత్తిడి అనేది అడ్రినోకోర్టికోట్రోపిక్ హార్మోన్ (ఎసిటిహెచ్) యొక్క స్రావాన్ని పెంచుతుంది, ఇది శరీరంలో కార్టిసాల్ స్థాయిలను (ఒత్తిడి హార్మోన్) పెంచుతుంది. అశ్వగంధ పొడి కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఒత్తిడిని మరియు అధిక రక్తపోటు వంటి దానితో సంబంధం ఉన్న సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది
 
ఒత్తిడిని తగ్గించుకునేందుకు...
1. ఒక కప్పు నీటిలో 1/ 4- 1/2 టీస్పూన్ అశ్వగంధ రూట్ పౌడర్ తీసుకోండి.
2. మిశ్రమాన్ని పాన్‌లో కనీసం 10 నిమిషాలు ఉడకబెట్టండి.
3. రుచిని పెంచడానికి కొన్ని చుక్కల నిమ్మకాయ, 1 టీస్పూన్ తేనె జోడించండి.
4. ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకసారి ఉదయం త్రాగాలి.
 
రక్తపోటు, అంటే ధమనులలో రక్తం యొక్క అధిక పీడనం. రక్తపోటుకు ఆయుర్వేద చికిత్స యొక్క లక్ష్యం పరిస్థితి యొక్క మూల కారణాన్ని గుర్తించి, ఆపై దాని మూలాల నుండి సమస్యను నిర్మూలించగల మూలికలను తీసుకోవడం. ఒత్తిడి లేదా ఆందోళన కూడా రక్తపోటుకు ఒక మూల కారణం. అశ్వగంధ తీసుకోవడం ఒత్తిడి లేదా ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. తద్వారా అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
 
రక్తపోటు అదుపుకి..
 పాలతో భోజనం చేసిన రెండు గంటల తర్వాత అశ్వగంధ యొక్క 1 గుళిక లేదా టాబ్లెట్‌తో ప్రారంభించాలి. అలాగే, ఇతర యాంటీహైపెర్టెన్సివ్ ఔషధాలతో అశ్వగంధను తీసుకునేటప్పుడు మీ రక్తపోటును క్రమంతప్పకుండా పర్యవేక్షించాలి. వైద్యుడి సలహా తీసుకోవాలి.

అన్నీ చూడండి

అర్నబ్ తుఫాను ప్రభావంపై రిలయన్స్ ఫౌండేషన్ స్పందన: మత్స్యకార పడవల పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభం

హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?

మధ్యంతర ఫలితాలపై ఖంగుతిన్న ట్రంప్ - వైట్‌‍హౌస్‌లో కీలక మార్పు

ఏపీ పరిషత్ ఎన్నికల్లో సాఫీగా కౌంటింగ్.. కూటమి జోరు

లగ్జరీ హోటల్ గదిలో అమెరికన్ పౌరుడు మృతి.. ఏం జరిగింది?

అన్నీ చూడండి

Dhanush apology :నా పాటను పక్కన పెట్టంది సాయి అభ్యంకర్ మాత్రమే - మరోవైపు ధనుష్ క్షమాపణలు

కిల్లర్ మూవీ కోటి కాంటెస్ట్ లో ఎవరూ విన్ కాలేదు, కానీ...బహుమతి ఇస్తున్నాం - డైరెక్టర్ పూర్వాజ్

Neha Sshetty: సాయి శ్రీనివాస్, నేహా శెట్టి ల మధ్య మదరాసి రబ్బరు బొమ్మ రొమాంటిక్ కు ఆదరణ

రాముడికి 14 యేళ్ల వనవాసం - నా వనవాసం ఎపుడు ముగుస్తుంది : రేణూ దేశాయ్

55 years Trivikram Srinivas :జేబులో చేతులు పెట్టుకుని అలా.. 55వ పుట్టినరోజు కు చేరుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

తర్వాతి కథనం
Show comments