శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 జనవరి 2023 (13:04 IST)

కుక్కవామింట, కలాస కూర గురించి తెలుసా?

Ayurveda
Ayurveda
కుక్కవామింట ఆకులో ఆరోగ్యానికి  సహకరించే ఎన్నో పోషకాలు వున్నాయి. క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్లు వున్నాయి. ఇవి కండరాలకు, ఎముకలకు బలాన్నిస్తాయి. 
 
కుక్కవామింట ఏపీలోని పంట పొలాల్లో చలికాలంలో విపరీతంగా పెరుగుతుంది. ఈ ఆకులను రోడ్డుకు ఇరువైపులా కూడా చూడవచ్చు. కుక్కవామింట ఆకులను నూరి ఆ రసాన్ని పుండ్లకు పై పూతగా పూస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
చెవి నొప్పితో బాధపడేవారు వైల్డ్ మస్టర్డ్ అని ఆంగ్లంలో పిలువ బడే ఈ కుక్కవామింటాకు రసాన్ని చెవిలో వేసుకున్నా బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కూరను పప్పు వేసుకుని వండుకుని తినడం చేస్తారు. 
 
ఊరగాయల్లో ఉపయోగిస్తారు. విత్తనాల నుంచి వంటనూనెను కూడా ఉపయోగిస్తారు. అలాగే కలాస కూర ఆయుర్వేదం ప్రకారం కడుపు నొప్పులను దూరం చేస్తుంది. ఈ ఆకు కొండ వాగుల పక్కన లభ్యమవుతుంది. బంజరు భూముల్లోనూ చూడవచ్చు. దీన్ని నేల బీర అని కూడా అంటారు.