శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (15:35 IST)

గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా ఉపయోగాలేంటో తెలుసా?

చల్లని నీటిని సేవించడం కంటే గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. జలుబు చేసినవారు వేడినీటిని తాగడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. జలుబు కూడా నయం అవుతుంది. నూనె పదార్థాలు అంటే స్వీట్స్

చల్లని నీటిని సేవించడం కంటే గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. జలుబు చేసినవారు వేడినీటిని తాగడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. జలుబు కూడా నయం అవుతుంది. నూనె పదార్థాలు అంటే స్వీట్స్ లేదా పూరీలు తిన్న వెంటనే గ్లాసుడు వేడి నీరు తాగడం ద్వారా గొంతులో మంట, అజీర్తి సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
ఒంటి నొప్పులు తగ్గాలంటే వేడి నీటిలో కాస్త శొంఠి పొడి కలుపుకుని తీసుకుంటే సరిపోతుంది. పాదాల నొప్పికి వేడి నీటితో నింపిన టబ్‌లో కాళ్లను ఉంచాలి. అందులో కాస్త ఉప్పును చేర్చుకోవాలి. ఇలా చేస్తే పాదాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పాదాలకు మురికి అంటి వుంటే వేడి నీళ్లలో కాస్త డెటాల్ పోసి.. అందులో కాళ్లను వుంచాలి. ఇలా చేస్తే పాదాలు శుభ్రం కావడంతో పాటు పాదాల నొప్పులు కూడా మటాష్ అవుతాయి. 
 
అలాగే ఎండలో తిరిగి ఇంటికొచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగకుండా.. కాస్త గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా దాహం తీరిపోతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఎప్పుడూ గోరువెచ్చని నీటిని తీసుకోవడాన్నే అలవాటు చేసుకోవాలి. తలనొప్పి, అజీర్ణం వంటి రుగ్మతలను దూరం చేసుకోవాలంటే.. గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ శొంఠి పొడిని కలిపి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా బరువు కూడా తగ్గొచ్చు. నీరసాన్ని దూరం చేసుకోవచ్చు. అలసటను తరిమికొట్టొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.