Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

టమోటా జ్యూస్‌లో కొద్దిగా ఉప్పు కలిపి..?

Updated: శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (12:51 IST)
ఇప్పటి కాలంలో మహిళలు అన్నీ రంగాల్లో ధీటుగా రాణిస్తున్నారు. పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో తమ సత్తా చాటుకుంటున్నారు. ప్రస్తుతం మహిళలు వ్యక్తిగత వికాసంతో పాటు అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రతిరోజూ తమ అందాన్ని మెరుగు పరుచుకునేందుకు ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. 
 
ముఖ్యంగా కంటి అందంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అయినప్పటికీ ప్రతిరోజూ కంప్యూటర్ల ముందు కూర్చునే మహిళలకు కంటి కింద చారలు వచ్చేస్తున్నాయి. అలా మీ కంటికి కింద చారలున్నట్లైతే ఈ కథనాన్ని చదవాల్సిందే.
 
రాత్రివేళ నిద్రలేకున్నా, అతిగా పనిచేసినా ఆ అలసట ముఖంలో ప్రతిబింబిస్తుంది. ఆ విషయాన్ని కళ్ల కింద ఏర్పడే నల్లని చారలు స్పష్టం చేస్తాయి. ఆ నల్లటి చారలు పోవాలంటే పుదీనా ఆకులను బాగా చిదిమి కంటి కింద రాసుకుంటే చల్లగా ఉంటుంది.
 
ఇలా చేయడం వలన అలసట తగ్గిపోతుంది. అదేవిధంగా నాలుగైదు బాదం పప్పుల్ని నానబెట్టి మెత్తగా నూరి దానికి తాజా పాలను కొద్దిగా కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద రాసి 10 నుంచి 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. 
 
అదేవిధంగా ఒక గ్లాస్ టమోటా జ్యూస్‌లో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి, దానిపై పుదీనా ఆకులు చల్లి రోజుకు రెండుసార్లు తాగితే కంటి కింద నల్ల చారలు  మాయమవుతాయని బ్యూటీషన్లు చెబుతున్నారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments