Daily Horoscope
✕

నలుపుగా మారిన పెదవులను రోజా రేకుల్లా మార్చాలంటే?

పెదవులకు లిప్ బామ్స్‌ వాడుతున్నారా? లిప్ స్టిక్కులు వాడుతున్నారా? వాటిని ఇక ఆపేయండి. ఎందుకంటే వాటిలోని రసాయనాలు పెదవులను నలుపుగా మార్చేస్తాయి. అందుకే పెదవులు నల్లబారకుండా వుండాలంటే.. నలుపు తిరిగిన పెద

Written By selvi
Updated: శనివారం, 17 మార్చి 2018 (18:50 IST)
పెదవులకు లిప్ బామ్స్‌ వాడుతున్నారా? లిప్ స్టిక్కులు వాడుతున్నారా? వాటిని ఇక ఆపేయండి. ఎందుకంటే వాటిలోని రసాయనాలు పెదవులను నలుపుగా మార్చేస్తాయి. అందుకే పెదవులు నల్లబారకుండా వుండాలంటే.. నలుపు తిరిగిన పెదవులు రోజా రేకుల్లా తయారవ్వాలంటే.. ఈ చిట్కాలు పాటించండి. అలొవెరా గుజ్జును రోజూ రాసుకుంటే చాలు. ఇందులోని పాలీఫినాలిక్‌ ఆమ్లాలు పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. అందులోని పోషకాల కారణంగా పెదాలు మృదువుగా మారుతాయి. 
 
అలాగే టేబుల్‌స్పూను నిమ్మరసంలో టేబుల్‌స్పూను తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు పట్టించి ఓ గంటసేపు ఉంచాలి. తరవాత మెత్తని తడిబట్టతో తుడిచేయాలి. ఇలా రోజుకి కనీసం మూడుసార్లు చేయాలి. నిమ్మరసం వల్ల పెదవుల నలుపు రంగు పోతుంది. తేనె వల్ల పెదవులు మృదువుగా తయారవుతాయి. 
 
అలాకాకుంటే కాటన్ బడ్‌తో గ్లిజరిన్‌ను పెదవులకు రాసి నిద్రించాలి. ఇలా చేస్తే పెదవులు మృదువుగా తయారవుతాయి. నల్లబడిన పెదాలకు ఆపిల్‌ సిడార్‌ వినెగర్‌ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. టీస్పూను వినెగర్‌లో టీస్పూను నూనె కలిపి దాన్ని దూది సాయంతో పెదాలకు పట్టించి, పది నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే మంచిదని.. తద్వారా పెదవులు రోజా రేకుల్లా తయారవుతాయని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

లగ్జరీ హోటల్ గదిలో అమెరికన్ పౌరుడు మృతి.. ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే : వైఎస్ షర్మిల

అర్నాబ్, మురసు.. ఇతర రాష్ట్రాల నుంచి 3వేల మంది విద్యుత్ శాఖ సిబ్బంది..

మాండ్యలో వివాహిత - ఆమె ప్రియుడు ఆత్మహత్య

వైట్‍‌హౌస్ వద్ద ఆయుధాలతో వెనెజువెలా జాతీయుడి అరెస్టు

అన్నీ చూడండి

కిల్లర్ మూవీ కోటి కాంటెస్ట్ లో ఎవరూ విన్ కాలేదు, కానీ...బహుమతి ఇస్తున్నాం - డైరెక్టర్ పూర్వాజ్

Neha Sshetty: సాయి శ్రీనివాస్, నేహా శెట్టి ల మధ్య మదరాసి రబ్బరు బొమ్మ రొమాంటిక్ కు ఆదరణ

రాముడికి 14 యేళ్ల వనవాసం - నా వనవాసం ఎపుడు ముగుస్తుంది : రేణూ దేశాయ్

55 years Trivikram Srinivas :జేబులో చేతులు పెట్టుకుని అలా.. 55వ పుట్టినరోజు కు చేరుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

స్లమ్‌లో కుర్రాడు.ప్రేమ, అడ్డంకుల సవాల్ నేపథ్యంగా ఛప్రి చిత్రం

తర్వాతి కథనం
Show comments